BrahMos Supersonic Cruise Missile: బ్రహ్మోస్ కొత్త వెర్షన్ పరిధి ఎన్ని కిలోమీటర్లు?
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. వాయుమార్గాన ప్రయోగించే ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ 800 కిలోమీటర్లు ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదించగలదని అంచనా. ఇప్పటివరకు దీని పరిధి దాదాపు 300 కిలోమీటర్లుంది. బ్రహ్మోస్ రేంజ్ ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తూ వస్తున్నారని, సాఫ్ట్‌వేర్‌లో చిన్న మార్పుతో రేంజ్‌ను 500 కిలోమీటర్లు పెంచవచ్చని, తాజాగా దీని టార్గెట్ రేంజ్‌ను 800కిలోమీటర్లకు చేరనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని çసుఖోయ్– 30 ఎంకేఐ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్రయోగిస్తారు. ప్రస్తుతం భారత వాయుసేన వద్ద బ్రహ్మోస్ మిస్సైల్ అమర్చిన çసుఖోయ్–30 విమానాలు 40 ఉన్నాయి.
Kavach Technology: రైలు ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థను ఎక్కడ పరీక్షించారు?
ముఖ్యాంశాలు..
- విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, నేల మీద నుంచి నిర్దేశించిన లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ఛేదించగలవు.
- భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)తో కలిసి బీఏపీఎల్ బ్రహ్మోస్ క్షిపణుల్ని తయారు చేస్తోంది. ఇండో–రష్యన్ జాయింట్ వెంచర్‌లో భాగంగా బ్రహ్మోస్‌ను అభివృద్ధి చేసిన విషయం విదితమే.
- ఫిలిప్పీన్స్ నేవీకి యాంటీ–షిప్ బ్రహ్మోస్ క్షిపణుల సరఫరా చేయడానికి ఇటీవల ఒప్పందం కుదిరిన విషయం విదితమే.
Vacuum Bomb: థర్మోబారిక్ బాంబులు ఏ సూత్రం ఆధారంగా విధ్వంసం సృష్టిస్తాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 800 కిలోమీటర్ల రేంజ్‌తో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేస్తోన్న దేశం?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : భారత్
ఎక్కడ : భారత్
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు..