Agni Prime Missile: అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ), స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్(ఎస్‌ఎఫ్‌సీ) సహకారంతో భారత సైన్యం అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా సముద్ర తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మార్చి 3వ తేదీ ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.
అగ్నిప్రైమ్ నిర్దేశిత అన్ని లక్ష్యాలను చేరుకుందని వెల్లడించింది. ఈ మిస్సైల్ అణ్వాయుధాలను మోసకెళ్లగలదు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ కార్యక్రమం కింద దేశీయంగా అభివృద్ధి చేశారు. ఇది మీడియం రేంజ్ క్షిపణి. దీని స్ట్రైక్ రేంజ్ 1,000 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించడం అగ్నిప్రైమ్ ప్రత్యేకత. 1,500 నుంచి 3,000 కిలోల దాకా వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. బరువు దాదాపు 11,000 కిలోలు.
Rakesh Sharma: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి ఈయనే.. ఈ యాత్రకు 40 ఏళ్లు!!
అగ్ని క్షిపణుల శ్రేణిలో ఇది ఆరో క్షిపణి కావడం విశేషం. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్ తదితర క్షిపణులను అభివృద్ధి చేశారు.
Tags
- Agni-Prime test flight
- APJ Abdul Kalam Island
- Agni Prime
- Abdul Kalam Island
- Strategic Forces Command
- Defence Research and Development Organisation
- DRDO
- Indian Army Test
- Agni Prime missile
- DRDO Collaboration
- Defence Department Announcement
- APJ Abdul Kalam Island Launch
- Odisha Coast Testing
- March 3 Test Fire
- SFC Partnership
- sakshieducation updates