Human Papillomavirus: హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్9ను అభివృద్ధి చేసిన సంస్థ?
జెండర్ న్యూట్రల్(ఆడా, మగా అందరూ తీసుకోదగిన) హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్9ను ఎంఎస్‌డీ(మెర్క్ షార్ప్–డొహ్మె) ఫార్మా సెప్టెంబర్ 29న దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 9 వాలెంట్ టీకా హెచ్‌పీవీ టైప్స్ 6, 11,16, 18, 31, 33, 45, 52, 58 రకాలపై పనిచేస్తుందని తెలిపింది. హెచ్‌పీవీ వైరస్ కారణంగా వచ్చే పులిపర్లలాంటివాటి నిరోధంలో, ఈ వైరస్‌ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో టీకా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. మగ(9–15 సంవత్సరాలు), ఆడ(9–26 సంవత్సరాలు)వారికి ఈ టీకాను ఇవ్వవచ్చని వివరించింది. గార్డ్‌సిల్9ను ఎంఎస్‌డీ సంస్థ తయారు చేసింది. హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమావైరస్) వైరస్‌లు ఆడవారికి, మగవారికి సోకుతాయి.
స్పుత్నిక్–వి..
కోవిడ్–19 మహమ్మారి నియంత్రణ కోసం రష్యా స్పుత్నిక్–వి పేరుతో కరోనా టీకాను అభివృద్ధి చేసింది. భారత్‌లో ఈ టీకా పంపిణీ బాధ్యతలను డాక్టర్ రెడ్డిస్ ల్యాబోరేటరీస్ సంస్థ స్వీకరించింది. దేశంలో 2021, మే నెలలో దీన్ని ఆవిష్కరించారు. కేవలం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉన్న స్పుత్నిక్–వి వ్యాక్సిన్‌కు డిమాండ్ పడిపోయిందని వైద్య వర్గాలు తెలిపాయి.
చదవండి: ప్రధాని ఆవిష్కరించిన 35 నూతన వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్9 విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : ఎంఎస్‌డీ(మెర్క్ షార్ప్–డొహ్మె) ఫార్మా సంస్థ
ఎక్కడ : భారత్
ఎందుకు : హెచ్‌పీవీ వైరస్ కారణంగా వచ్చే పులిపర్లలాంటివాటి నిరోధంలో, ఈ వైరస్‌ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో టీకా ఉపయుక్తంగా ఉంటుందని...