Covid-19: టీకా మిశ్రమ డోసులతో 4 రెట్లు అధిక రక్షణ: ఏఐజీ
కరోనాను అడ్డుకునేందుకు ఇచ్చే టీకాలను మిశ్రమ పద్ధతిలో ఇవ్వడం వల్ల నాలుగురెట్లు అధికంగా యాంటీబాడీ రెస్పాన్స్ కనిపిస్తోందని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) హాస్పిటల్స్ అధ్యయనం వెల్లడించింది. ఏసియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్‌తో కలిసి ఏఐజీ ఈ అధ్యయనం నిర్వహించింది. తొలి మలి డోసులుగా కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ను లేదా కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ను ఇవ్వడం వల్ల నాలుగురెట్ల అధిక రక్షణ లభిస్తుందని అధ్యయనం తెలిపింది. టీకా డోసుల మిశ్రమంతో లభించే రక్షణను పరిశీలించేందుకు ఈ అధ్యయనం జరిపామని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు.
గాన్యూల్స్ జేఎండీగా రామ్ రావు
ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా జేఎండీ, సీఈవోగా కేవీఎస్ రామ్ రావు నియమితులయ్యారు. ఫార్మా, కెమికల్స్ రంగంలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉందని కంపెనీ జనవరి 4న ప్రకటించింది.
ఆర్‌బీఐలో ఇరువురికి ఈడీలుగా పదోన్నతి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా దీపక్ కుమార్, అజయ్ కుమార్ చౌదరిలు పదోన్నతి పొందారు. సెంట్రల్ బ్యాంక్ ఈ మేరకు జనవరి 4న ఒక ప్రకటన చేసింది. ఈడీలుగా పదోన్నతికి ముందు దీపక్ కుమార్ ఆర్‌బీఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ చీఫ్‌గా ఉండగా, చౌదరి పర్యవేక్షణా విభాగం మేనేజర్–ఇన్–చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
చదవండి: ఐహెచ్‌యూ వేరియంట్ ఏ దేశంలో బయటపడింది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్