C-DAC: దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సర్వర్ పేరు?
![Rudra Server](/sites/default/files/images/2021/12/04/rudra-server-1638612834.jpg)
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సర్వర్ ‘రుద్ర’ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డిసెంబర్ 3న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీనిని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) అభివృద్ధి చేసింది. ‘‘రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం, దేశ కంప్యూటింగ్ అవసరాలకు తగినట్టు అందించడంలో భారత్ సామర్థ్యాలను ఇది తెలియజేస్తుంది’’ అని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
శిక్షోదయ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ?
ఆన్‌లైన్ విద్య అందిస్తున్న అన్‌అకాడమీ శిక్షోదయ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 5 లక్షల మంది బాలికలకు విద్యాబోధన అందిస్తారు. ఉద్యోగాలు పొందడంలో సహాయపడటమే కాకుండా చదువు మానేసిన బాలికలకు సొంతంగా జీవనోపాధిని పొందేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు.
చదవండి: చెత్త కారణంగా స్పేస్‌వాక్‌ను నిలిపేసిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి సర్వర్ ‘రుద్ర’ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశ కంప్యూటింగ్ అవసరాల కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్