International Space Station: చెత్త కారణంగా స్పేస్‌వాక్‌ను నిలిపేసిన సంస్థ?
అంతరిక్షంలో తాజాగా పెరిగిన ‘చెత్త’ కారణంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA - నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) తన స్పేస్‌వాక్ కార్యక్రమాన్ని వాయిదావేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు సమీపంగా వేగంగా పరిభ్రమిస్తున్న శకలాలు స్పేస్‌వాక్ సమయంలో వ్యోమగాముల సూట్‌కు తూట్లు పెట్టే ప్రమాదముందని స్పేస్‌వాక్‌ను ఆపేశారు. ఐఎస్‌ఎస్‌కూ నష్టం వాటిల్లవచ్చని భావించారు. ఐఎస్‌ఎస్ బయటి యాంటీనాను మార్చేందుకు వ్యోమగాములు సిద్ధమయ్యారు. అయితే, డిసెంబర్ 6న ఒక శకలం ఐఎస్‌ఎస్‌కు దగ్గరగా దూసుకెళ్లవచ్చని అంచనాకొచ్చారు. దీంతో యాంటీనా పునరుద్ధరణ కార్యక్రమం ఆగింది.
దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఒమిక్రాన్..
పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఒమిక్రాన్ వేరియెంట్ 2021, అక్టోబర్‌లో బయటపడింది. ఈ వేరియెంట్‌పై ప్రపంచ దేశాలను దక్షిణాఫ్రికా హెచ్చరించడానికి ముందే నైజీరియాలో ఇది వెలుగులోకి వచ్చిందని నైజీరియా ప్రజారోగ్య సంస్థ వెల్లడించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఇది బయటపడిందని పేర్కొంది.
చదవండి: ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరాను తయారు చేసిన సంస్థలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పేస్‌వాక్ కార్యక్రమాన్ని వాయిదా వేసిన సంస్థ?
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA - నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)
ఎందుకు : అంతరిక్షంలో తాజాగా పెరిగిన ‘చెత్త’ కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్