Skip to main content

Gaganyaan Missions:‘సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌’ పరీక్ష విజయవంతం

గగన్‌యాన్‌ ప్రయోగంలో భాగంలో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడే ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌ తయారీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ఘనత సాధించింది.
Indian Space Research Organization    LVM3 for manned space missions   ISRO Successfully Achieves Completion Of Human Rating Of CE20 Cryogenic Engine For Gaganyaan Mission

ఈ లాంచ్‌ వెహికల్‌కు గుండెకాయ లాంటి ‘సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌’ను విజయవంతంగా పరీక్షించిన‌ట్లు ఇస్రో ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ వెల్లడించింది. తమ పరీక్షలో క్రయోజనిక్‌ ఇంజన్‌ పూర్తి సంతృప్తికరమైన పనితీరు కనబర్చిందని, అంతరిక్ష యాత్రలకు అర్హత సాధించిందని వెల్లడించింది. గగన్‌యాన్‌ యాత్రకు ఈ ఇంజన్‌ అనువైందని తేలినట్లు స్పష్టం చేసింది. పలు రకాల కఠిన పరీక్షల తర్వాత ఈ క్రయోజనిక్‌ ఇంజిన్‌ భద్రతా ప్రమాణపత్రాన్ని పొందిందని పేర్కొంది. మానవ రహిత గగన్‌యాన్‌–1 యాత్రను 2024లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే మానవ సహిత యాత్ర చేపట్టనున్నారు.

ముగ్గురు వ్యోమగాములను భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి చేర్చి, మళ్లీ క్షేమంగా వెనక్కి తీసుకురావడం గగన్‌యాన్‌ మిషన్‌ లక్ష్యం. మొత్తం మూడు రోజుల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగంలో వ్యోమగాములను ఎల్‌వీఎం3 లాంచ్‌ వెహికల్‌లో అంతరిక్షంలోకి చేర్చాలని నిర్ణయించారు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజనిక్‌ దశలు ఉంటాయి.

ఈ క్రయోజనిక్‌ దశలో లాంచ్‌ వెహికల్‌ను గమ్యస్థానానికి చేర్చడంలో సీఈ20 ఇంజిన్‌ పాత్ర అత్యంత కీలకం. ఈ ఇంజన్‌పై ఏడో వాక్యూమ్‌ టెస్టును ఈ నెల 14న తమిళనాడు మహేంద్రగిరిలోని హై ఆల్టిట్యూడ్‌ టెస్ట్‌ ఫెసిలిటీలో నిర్వహించినట్లు ఇస్రో వెల్లడించింది. గగన్‌యాన్‌ మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించామని ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. సీఈ20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ యాక్సెప్టెన్స్‌ టెస్టులు, ఫైర్‌ టెస్టులు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి.  

GSLV-F14: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌14 ప్రయోగం విజ‌య‌వంతం

Published date : 22 Feb 2024 01:51PM

Photo Stories