PSLV-C55: ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్‌వీ సీ55 ప్రయోగం
Sakshi Education
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏప్రిల్ 22న మధ్యాహ్నం 2.19 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధం చేస్తోంది.
ఇస్రో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి వాణిజ్య ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్–02 అనే ఉపగ్రహంతో పాటు లూమిలైట్–4 అనే 16 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రోదశీలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లో నాలుగోదశ (పీఎస్–4)ను ఒక ఎక్స్‌పర్‌మెంటల్ చేయనున్నారు. ఈ రాకెట్‌లో ఆర్బిటల్ ఎక్స్‌పర్‌మెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) అమర్చి పంపిస్తున్నారు. అంటే పోలార్ ఆర్బిట్‌లో ఇంకా ఎన్ని రకాల కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చో పరిశోధన చేయడానికి ఈ ఎక్స్‌పర్‌మెంటల్ ప్రయోగాన్ని చేస్తున్నారు.
LVM3 Rocket: వన్‌వెబ్ ఇండియా–2 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..
Published date : 20 Apr 2023 01:16PM