Indian Ayurvedic Medicine: క్యాన్సర్ కు భారతీయ ఆయుర్వేద ఔషధం
Sakshi Education
క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించిన ఆయుర్వేద ఔషధం ’వీఎస్ 2’ పై క్లినికల్ ప్రయోగాలు నిర్వహించేందుకు భారత్‌లోని అగ్రశ్రేణి సంస్థలు చేతులు కలిపాయి. ఈ మందును కొన్ని రకాల మొక్కల నుంచి సేకరించి హైడ్రో–ఆల్కహాలిక్ పదార్థాలతో తయారుచేశారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఎన్‌ఐఏ) దీన్ని అభివృద్ధి చేసింది. దీని సామర్థ్యాన్ని మనుషులపై పరీక్షించి చూసే కసరత్తులో ఎన్‌ఐఏతోపాటు ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్, ఏఐఎం ఐఎల్ ఫార్మా వంటి సంస్థలు భాగస్వాములయ్యాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 21 Apr 2023 05:52PM