IIT Hyderabad: రోడ్డు ప్రమాదాలపై పరిశోధన చేస్తోన్న ఐఐటీ?
దీనికోసం ముంబై హైవే (65)పై సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసింది. వాహనాల వేగాన్ని కొలిచేందుకు పోలీసుశాఖ ఏర్పాటు చేసే స్పీడ్‌గన్ మాదిరిగా ఉన్న ఈ పరికరాలు జాతీయ రహదారిపై వాహనాల కదలికలను క్షుణ్ణంగా రికార్డు చేస్తోంది.
అంతరిక్ష ప్రయోగాలకు కొత్త సాధనం
అంతరిక్షంలో జరిపే జీవసంబంధిత ప్రయోగాలకు ఉపయోగపడే ఒక సాధనాన్ని ఇస్రో, ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ మాడ్యులర్ సాధనంతో జీవప్రయోగాలకు అవసరమైన సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తారు. అక్టా ఆస్ట్రోనాటికాలో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. స్పొరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాను చాలా రోజులపాటు పెంచి పోషించేందుకు కొత్త సాధనం ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిశోధనలో వివరించారు. అంతరిక్షంలో ఎదురయ్యే విపరీత పరిస్థితుల్లో సదరు సూక్ష్మజీవులు ఎలా స్పందిస్తాయన్న విషయాలను అవగతం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు కీలకపాత్ర పోషిస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల తీరుపై పరిశోధన
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : హైదరాబాద్ ఐఐటీ
ఎక్కడ : ముంబై హైవే, కంది మండల కేంద్రం, సంగారెడ్డి జిల్లా,
ఎందుకు : రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు కారణాలు తెలుసుకునేందుకు...