Skip to main content

LCA Tejas Mk1A: తేజస్‌ మార్క్‌1ఏ సక్సెస్.. మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం ఇదే..

అధునిక యుద్ధసామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్‌ మార్క్‌1ఏ తేలికపాటి యుద్ధవిమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది.
HAL Conducts Successful First Flight of LCA Tejas Mk1A in Bengaluru

మార్చి 28వ తేదీ బెంగళూరులోని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) కేంద్రం నుంచి టేకాఫ్‌ తీసుకుని 18 నిమిషాలపాటు గాల్లో నిర్దేశిత ‘పథం’లో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. తేజస్‌ ఎంకే1ఏ సిరీస్‌లో ఎల్‌ఏ5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్‌ఏఎల్‌లోని చీఫ్‌ టెస్ట్‌ పైలెట్‌ గ్రూప్‌ కెపె్టన్‌ కెకె వేణుగోపాల్‌(రిటైర్డ్‌) ఈ విమానాన్ని నడిపారు.

విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్‌తో అధునాతన యుద్ధవిమానాలను తయారుచేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ‘అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్‌తో స్వదేశీ 4.5 నూతనతరం యుద్ధవిమానాన్ని తయారుచేయడంలో హెచ్‌ఏఎల్‌ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థకు కృతజ్ఞతలు’ అని హెచ్‌ఏఎల్‌ చీప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనంతకృష్ణన్‌ చెప్పారు.  

IIT-Guwahati: ఐఐటీ-గౌహతి నుంచి బయోమెడ్‌కు కొత్త టీకా టెక్నాలజీ

గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎల్రక్టానిక్‌ రాడార్, కమ్యూనికేషన్‌ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్‌ పాడ్‌లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్‌ మార్క్‌1ఏలను తయారుచేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్‌ ‘ఫ్లయింగ్‌ డ్యాగర్‌’, ‘ఫ్లయింగ్‌ బుల్లెట్‌’ పేరుతో రెండు బృందాలు ఉన్నాయి. 

Published date : 29 Mar 2024 04:24PM

Photo Stories