HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. 14వ మహారత్న కంపెనీ
ఈ హోదా సాధించిన 14వ కేంద్ర పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ (CPSE)గా హెచ్ఏఎల్ నిలిచింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని అంతర్ మంత్రిత్వ కమిటీ, ఎపెక్స్ కమిటీ సిఫార్సుల ప్రకారం హెచ్ఏఎల్‌కు ఈ అప్‌గ్రేడ్‌కి ఆమోదం లభించింది.
మహారత్న హోదా పొందడానికి హెచ్ఏఎల్ గత మూడేళ్లలో సగటు వార్షిక టర్నోవర్ రూ.25,000 కోట్లు మించాలి. నికర విలువ రూ.15,000 కోట్లకు పైగా ఉండాలి. నికర లాభం రూ.5,000 కోట్లను మించాలి.
ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఏఎల్ 15% నికర విలువ లేదా రూ.5,000 కోట్ల వరకు విదేశీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టగలదు. హెచ్ఏఎల్ షేర్ విలువ రూ.4,510 వద్ద ట్రేడ్ అయ్యి, 1.42% పెరుగుదల నమోదైంది.
GatiShakti: పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు మూడేళ్లు పూర్తి
ఇప్పటివరకు మహారత్న హోదా ఉన్న కంపెనీలు ఇవే..
1. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్
2. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) లిమిటెడ్
3. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)
4. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)
5. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)
6. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)
7. కోల్ ఇండియా లిమిటెడ్ (CIL)
8. గెయిల్ ఇండియా లిమిటెడ్ (GAIL)
9. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)
10. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID)
11. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC)
12. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) లిమిటెడ్
13. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL)