General Bipin Rawat: ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను రూపొందించిన సంస్థ?
భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ లక్షణ్ సింగ్ రావత్(63) డిసెంబర్ 8న తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కూనూర్ అటవీ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో ఆయన మరణించారు. సాంకేతికంగా అడ్వాన్స్‌డ్ హెలికాప్టర్‌గా భావించే ఎంఐ–8 శ్రేణిలో ఎంఐ–17వీ5 హెలికాప్టర్ అత్యుత్తమమైనది. దీన్ని ఎంఐ–8 హెలికాప్టర్ నుంచే అభివృద్ధి చేశారు. ఎంఐ–8 ఎయిర్ ఫ్రేమ్‌పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను తమిళనాడులోని సూలూరు ఎయిర్‌బేస్‌లో ఉపయోగిస్తున్నారు.
ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్..
- ఎయిర్‌క్రాఫ్ట్ రకం: సైనిక రవాణా హెలికాప్టర్. సైనిక ఆపరేషన్లు, ప్రకృతి విపత్తుల్లోనూ సేవలందించగలదు.
- డిజైన్ చేసిందెవరు?: రష్యాలోని మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్
- రూపొందించింది?: రష్యా హెలికాప్టర్ల సంస్థకు అనుబంధ సంస్థ కజాన్
ఉత్పత్తి నుంచి భారత్‌కు చేరిందిలా..
- 1975లో తొలి ఎంఐ–17 హెలికాప్టర్ తయారీ ఎగుమతికి ఉద్దేశించిన హెలికాప్టర్లను ఎంఐ–17గా వ్యవహరిస్తారు. రష్యా సైనిక దళాలు మాత్రం వీటిని ఎంఐ–8ఎంటీ హెలికాప్టర్లుగా పిలుస్తాయి.
- ఎంఐ–17వీ5 హెలికాప్టర్ల కొనుగోలు కోసం 2008లో రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
- 2011 ఏడాదిలో భారత వైమానిక దళానికి అందజేత ప్రారంభం. 2012 నుంచి సేవలు ప్రారంభం.
ముఖ్యాంశాలు..
- ఎంఐ–17వీ5.. ప్రపంచంలో అత్యాధునిక రవాణా హెలికాప్టర్. సరుకులు, ఆయుధాల రవాణా కోసం డిజైన్ చేశారు.
- సైనికులను కూడా చేరవేయవచ్చు. అగ్ని మాపక సిబ్బందికి సాయపడుతుంది. కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్‌కు, గాలింపునకు, సహాయక చర్యల్లోనూ సేవలందిస్తాయి.
- ప్రపంచవ్యాప్తంగా ఈ హెలికాప్టర్లను 60 దేశాలు వినియోగిస్తున్నాయి.
మరిన్ని విశేషాలు..
- ఎంఐ–17వీ5 మధ్యశ్రేణి హెలికాప్టర్‌లో వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించే రాడార్, రాత్రిపూట సైతం వీక్షించే పరికరాలు ఉన్నాయి.
- గరిష్టంగా 13,000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఎక్కడా ఆగకుండా 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
- 36 మంది సైనికులను లేదా 4,000 కిలోల పేలోడును తరలించగలదు.
- రాత్రి, పగలు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట కూడా ల్యాండింగ్ చేయొచ్చు.
- గత పదేళ్లలో ఐఎం–17వీ5 హెలికాప్టర్లు కొన్ని ప్రమాదాలకు గురయ్యాయి.
చదవండి: రోదసీ యాత్ర చేపట్టిన జపాన్ కుబేరుడు ఎవరు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్