International Space Station: రోదసీ యాత్ర చేపట్టిన జపాన్ కుబేరుడు ఎవరు?
జపాన్ బిలియనీర్, ఫ్యాషన్ వ్యాపారాధిపతి యుసాకు మెజావా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు పయనమయ్యారు. సొంత నిధులతో అంతరిక్ష యాత్ర చేపట్టిన యుసాకుతో పాటు ప్రముఖ నిర్మాత యోజో హిరానో ఉన్నారు. యుసాకు యాత్రను హిరానో డాక్యమెంటరీగా చిత్రీకరించనున్నారు. రష్యాకు చెందిన సోయుజ్ స్పేస్‌క్రాఫ్ట్‌లో రష్యా కాస్మొనాట్ అలెగ్జాండర్ మిస్రుకిన్‌తో కలిసి వీరిరువురు రోదసీలోకి వెళ్లారు. కజకిస్తాన్‌లోని బైకనుర్ లాంచింగ్ స్టేషన్ నుంచి డిసెంబర్ 8న ఈ నౌక బయలుదేరింది. 12 రోజుల పాటు యుసాకు, హిరానో ఐఎస్‌ఎస్‌లో గడుపుతారు.
జపాన్‌లోని అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ మాల్ జోజోటవున్‌కు యుసాకు అధిపతి. ఆయన ఆస్తుల మొత్తం సుమారు 200 కోట్ల డాలర్లని అంచనా. 2023లో ఎలాన్ మస్క్ నిర్వహించే చంద్రయాత్రలో కూడా యుసాకు పాలుపంచుకోనున్నారు. రోదసీ నుంచి భూమిని వీక్షించడాన్ని ఇష్టపడతానని, భార రహిత స్థితిని అనుభవించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని యాత్రకు ముందు యుసాకు చెప్పారు.
చదవండి: నాసా వ్యోమగామిగా ఎంపికైన భారత సంతతి వైద్యుడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ నిర్మాత యోజో హిరానో, రష్యా కాస్మొనాట్ అలెగ్జాండర్ మిస్రుకిన్‌తో కలిసి సొంత నిధులతో అంతరిక్ష యాత్ర చేపట్టిన జపాన్ కుబేరుడు?
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : జోజోటవున్ అధిపతి యుసాకు మెజావా
ఎక్కడ : బైకనుర్ లాంచింగ్ స్టేషన్, కజకిస్తాన్
ఎందుకు : రోదసీ నుంచి భూమిని వీక్షించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్