Skip to main content

SpaceX: యూరప్‌ అంతరిక్ష ప్రయోగాలకు స్పేస్‌ ఎక్స్‌ దన్ను

లండన్‌: రష్యాతో బంధాలు తెంచుకున్న నేపథ్యంలో యూరప్‌ దేశాలు అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌పై ఆధారపడుతున్నాయి.
European Space Agency to launch two missions on SpaceX
European Space Agency to launch two missions on SpaceX

ఇందుకోసం స్పేస్‌ ఎక్స్‌తో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. రష్యా నుంచి చేపట్టాల్సిన పలు ప్రయోగాలకు స్పేస్‌ ఎక్స్‌ను వేదికగా మార్చుకుంటూ వస్తోంది. అవసరమైతే అంతరిక్ష సేవల కోసం భారత్‌పై కూడా ఆధారపడతామని సంకేతాలిచ్చింది. నాసా ప్రతిష్టాత్మక డార్ట్‌ స్పేస్‌క్రాఫ్ట్‌కు కొనసాగింపుగా ప్రయోగిస్తున్న హేరా ప్రోబ్‌తో పాటు యూక్లిడ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌లను స్పేస్‌ ఎక్స్‌ అభివృద్ధి చేసిన ఫాల్కన్‌–9ల ద్వారా ప్రయోగించనున్నారు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 22 Oct 2022 12:51PM

Photo Stories