Elon Musk's rocket punches a hole:ఎలాన్ మస్క్ ఫాల్కన్-9 రాకెట్‌తో అయనోస్పియర్‌కి రంధ్రం
వాతావరణంలో పైకి వెళ్లే కొద్దీ పొరలను ‘‘ట్రోపో, స్ట్రాటో, మీసో, థెర్మో(ఐనో), ఎక్సో, మాగ్నెటోస్పియర్‌లుగా విభజించబడిన సంగతి తెలిసిందే. జులై 19న కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్-9 రాకెట్‌ను ప్రయోగించారు. దీని ద్వారా స్టార్ లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అయానోస్పియర్ పొరను రాకెట్ చీల్చేయడం స్పష్టంగా కనిపించిందని.. ఆ సమయంలో ఎర్రని రంగు వెలుతురు ఉద్భవించిందని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెఫ్ బౌమ్‌గార్డెనర్ చెబుతున్నారు. అయానోస్పియర్.. మొత్తం అయాన్‌లతో ఆవరించబడి ఉంటుంది. సోలార్ ప్లాస్మా అయాన్లతో చర్య జరిపి ఆకాశంలో కనిపించే అద్భుతమైన రంగులను సృష్టించడానికి కారణం ఇదే. అంతేకాదు.. భూ అయస్కాంత తుఫానులకు అయానోస్పియరే కారణమని అమెరికా పరిశోధన సంస్థ నాసా చెబుతోంది.
☛☛ Twitter renamed as "X": ‘ఎక్స్’ యాప్‌గా ట్విట్టర్
వాతావరణ పొరల్లో అయానోస్పియర్ కూడా ముఖ్యమైనది. ఎందుకంటే.. ఇది కమ్యూనికేషన్, నేవిగేషన్ కోసం ఉపయోగించే రేడియో తరంగాలను ప్రతిబింబించడం, మార్పు చేయడం లాంటివి చేస్తుంది. ఒకవేళ అయానోస్పియర్‌కు డ్యామేజ్ జరిగితే.. అది GPS, నేవిగేషన్ సిస్టమ్‌లపై ప్రభావం కచ్చితంగా చూపుతుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో శక్తివంతమైన రాకెట్ల ప్రయోగం వల్ల ఇది సంభవించి తీరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.