Discovery of neutrinos: శక్తిమంతమైన న్యూట్రినోల ఆవిష్కరణ
శాస్త్ర పరిశోధనలో తొలిసారిగా ఓ పార్టికిల్ కొలైడర్ అత్యంత శక్తిమంతమైన న్యూట్రినో కణాలను వెలువరించింది. రెండు కణపుంజాలు ఒకదానితో ఒకటి ఢీకొనగా న్యూట్రినోలు వెలువడ్డాయని అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది. జెనీవాలోని సెర్న్ నిర్వహించిన ఫార్వార్డ్ సెర్చ్ ఎక్సె్పరిమెంట్(ఫేజర్)ద్వారా వీటిని కనుగొన్నారు. అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు లార్జ్ హేడ్రాన్ కొలైడర్ ఫేజర్ను ఏర్పాటు చేశారు. విశ్వంలో అత్యధికంగా కనిపించే కణాలే న్యూట్రినోలు. వీటిని1956లో కనుగొన్నారు. అప్పటి నుంచి తక్కువ శక్తి గల న్యూట్రినోలే పరిశోధనలకు లభ్యమవుతున్నాయి. తాజాగా ఫేజర్ కనుగొన్న న్యూట్రినోలు ప్రయోగశాలలో ఇంతవరకు ఎన్న డూ లేనంత అధిక శక్తి కలిగిఉన్నాయి. అవి అంతరిక్షంలో సుదూరం నుంచి భూమిని తాకే న్యూట్రినోలను పోలి ఉన్నాయి. నక్షత్రాలు మండే విధం గురించి న్యూట్రినోల ద్వారా తెలుసుకోవచ్చు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP