అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకూ Common Charger
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైన వివిధ పరికరాలన్నింటికీ కామన్‌గా ఒకే చార్జర్‌ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై మొబైల్స్ తయారీ సంస్థలు సహా పరిశ్రమ వర్గాలతో ఆగస్టు 17న సమావేశం కానుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా బహుళ చార్జర్ల వినియోగాన్ని, ఈ–వ్యర్థాలతో పాటు వినియోగదారులపై భారాన్ని కూడా తగ్గించే సాధ్యాసాధ్యాలను మదింపు చేసేందుకు ఈ భేటీ ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 2024 నాటికి చిన్న ఎల్రక్టానిక్ పరికరాలన్నింటికీ యూఎస్‌బీ–సీ పోర్ట్ తరహా చార్జర్ల వినియోగాన్ని అమల్లోకి తేనున్నట్లు యూరోపియన్ యూనియన్ ఇటీవలే ప్రకటించింది. అమెరికాలో కూడా ఇలాంటి డిమాండే ఉంది.
Also read: Internet: అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ లభ్యం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP