Skip to main content

Internet: అతి తక్కువ ధరకే ఇంటర్నెట్‌ లభ్యం

Internet

అతి తక్కువ ధరకే మొబైల్‌ డేటా లభ్యమయ్యే దేశాల జాబితాలో భారత్‌ నిలిచింది. 233 దేశాల్లో సేకరించిన డేటా ఆధారంగా.. భారత్‌తోపాటు మరో నాలుగు దేశాల్లో వినియోగదారులకు మొబైల్‌ డేటా చీప్‌గా దొరుకుతున్నట్ల తాజాగా విడుదలైన నివేదిక తెలిపింది. యూకేకు చెందిన 'కేబుల్‌.కో.యూకే' అనే టెలికాం సంస్థ 233 దేశాల్లో 1జీబీ డేటా ధర ఎంత ఉందనే అంశంపై గణాంకాలను విడుదల చేసింది. అందులో మొబైల్‌ డేటా తక్కువ ధరకే లభ్యమయ్యే 5 దేశాల్లో భారత్‌కు 5వ స్థానం దక్కింది. ఇక ఆ 5 దేశాల్లో ఇజ్రాయిల్‌ దేశం 1జీబీ డేటాను 0.04 డాలర్లు (భారత్‌ కరెన్సీలో రూ.3.20), ఇటలీ 0.12 డాలర్లు(రూ.9.59), శాన్‌ మారినో 0.14 డాలర్లు (రూ.11.19), ఫిజి దేశంలో 1జీ డేటా 0.15 డాలర్ల (రూ.11.99), భారత్‌ 0.17 డాలర్ల(రూ.13.59)తో వరుస స్థానాల్లో నిలిచాయి.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (International) Bitbank: "నూరి" పేరుతో తన మొదటి స్వదేశీ రాకెట్‌ను ఏ దేశం ప్రయోగించింది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Aug 2022 05:56PM

Photo Stories