Aditya's L1 orbit: ఆదిత్య ఎల్1 కక్ష్య మరోసారి పెంపు
ఉపగ్రహంలో ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని పెంచడంతో ఈ ప్రక్రియ విజయవంతమైంది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ ప్రక్రియను చేపట్టారు. మారిషస్, బెంగళూరు, పోర్టుబ్లెయిర్‌లలోని గ్రౌండ్‌స్టేషన్ల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను నిశితంగా గమనించారు. రెండోసారి కక్ష్య దూరం పెంపుదలతో ఉపగ్రహం భూమికి దగ్గరగా 282 కిలోమీటర్లు, భూమికి దూరంగా 40,225 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరుకుంది. అంటే ప్రస్తుతం 282*40,225 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో అది తిరుగుతోంది. మొదటి విడతలో 245*22,459 కి.మీ.ల కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినవిషయం తెల్సిందే. రెండో విడతలో ఉపగ్రహాన్ని 282*40,225 కి.మీ.ల కక్ష్యలోకి తీసుకొచ్చారు. ఈనెల 10వ తేదీన మరోసారి కక్ష్య పెంచుతారు.
Aditya-L1 successfully boost first orbital: ఆదిత్య–ఎల్1 మొదటి కక్ష్య పెంపు విజయవంతం