3500 Year Old Menhir: ఇనుపయుగం నాటి భారీ మెన్హిర్‌ను ఎక్కడ గుర్తించారు?
తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, బీచురాజుపల్లి గ్రామ శివారులో మూడున్నర వేల ఏళ్ల క్రితం పాతిన ఓ భారీ మెన్హిర్ వెలుగు చూసింది. మరిపెడ–కురవి రహదారిపై ఉన్న ఈ మెన్హిర్‌ను చరిత్ర పరిశోధకులు, విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్‌రావుతో కలిసి గుర్తించారు. ఇది మూడడుగుల మందంతో తొమ్మిది అడుగుల ఎత్తుతో ఉంది. క్రీ.పూ.1500 సంవత్సరాల క్రితం ఇనుపయుగంలో ఏర్పాటు చేసిన ఈ అరుదైన మెన్హిర్‌ను కాపాడుకోవాలని, చరిత్ర పరిశోధనలో ఇవి కీలకమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.
International Arbitration Center: రాష్ట్రంలోని ఏ నగరంలో ఐఏఎంసీ నిర్మాణానికి భూమిపూజ చేశారు?
మెన్హిర్ అంటే ఏమిటీ?
ఆదిమ మానవులు చనిపోయిన తర్వాత సమాధి చేసే కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రముఖులెవరైనా చనిపోతే... వారి సమాధి వద్ద స్మృతిచిహ్నంగా భారీ నిలువు రాళ్లను పాతేవారు. ఆ నిలువు రాళ్లనే మెన్హిర్‌గా పేర్కొంటారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అలాంటి మెన్హిర్‌లు గతంలో వెలుగుచూశాయి. స్థానికులకు వాటిమీద అవగాహన లేకపోవడంతో ఇవి అదృశ్యమయ్యాయి.
Telangana: రాష్ట్రంలోని ఏ నగరంలో గ్రామీనర్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రీ.పూ.1500 సంవత్సరాల క్రితం ఇనుపయుగంలో ఏర్పాటు చేసిన భారీ మెన్హిర్‌ను ఎక్కడ గుర్తించారు?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : చరిత్ర పరిశోధకులు, విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్‌రావు
ఎక్కడ : బీచురాజుపల్లి గ్రామం, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్