Telangana: రాష్ట్రంలోని ఏ నగరంలో గ్రామీనర్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు?
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన కంపెనీ ‘గ్రామీనర్’ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభమైంది. మార్చి 14న ఈ సెంటర్‌ను తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు ప్రారంభించి, మాట్లాడారు. దేశంలో డేటాసైన్స్ రంగం వేగంగా పుంజుకుంటోందని.. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గ్రామినర్ ప్రస్థానం 2010లో ప్రారంభమైందని, ఇక్కడ మొట్టమొదటి డేటా సైన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ కంపెనీ తమదేనని సంస్థ సహ వ్యవస్థాపకుడు నవీన్ గట్టు చెప్పారు.
TS Socio Economic Outlook: తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22
శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి..
తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి మార్చి 14న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎగువ సభ ప్రతిష్టను, ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనమంతా కృషి చేద్దామని సభ్యులకు సూచించారు. గతంలో 21 నెలల పాటు కౌన్సిల్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించిన సందర్భంగా సభ గౌరవ మర్యాదలు కాపాడే ప్రయత్నం చేశామన్నారు.
Star State: సుపరిపాలనలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్రామీనర్ కంపెనీ ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతం, హైదరాబాద్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్