International Arbitration Center: రాష్ట్రంలోని ఏ నగరంలో ఐఏఎంసీ నిర్మాణానికి భూమిపూజ చేశారు?
అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వరం పరిష్కారం కోసం ఉద్దేశించిన.. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐకియా వెనుక భాగంలో ఐఏఎంసీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో శాశ్వత భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో కలిసి జస్టిస్ రమణ మార్చి 12న భూమిపూజ చేశారు. ఐఏఎంసీకి విలువైన భూమితో పాటు నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా పాల్గొన్నారు.
Telangana: రాష్ట్రంలోని ఏ నగరంలో గ్రామీనర్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు?
వైరాలో ఇండోర్ స్టేడియం, బోటింగ్ ప్రారంభం
ఖమ్మం జిల్లా వైరాలో రూ.89 లక్షలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని, వైరా రిజర్వాయర్ వద్ద తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు స్పీడ్ బోట్లను మార్చి 13న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వైరా రిజర్వాయర్‌ను పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
TS Socio Economic Outlook: తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే 2021–22
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) శాశ్వత భవన నిర్మాణానికి భూమిపూజ
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
ఎక్కడ : గచ్చిబౌలి, హైదరాబాద్
ఎందుకు : అంతర్జాతీయ వాణిజ్య వివాదాల సత్వరం పరిష్కారం కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్