Skip to main content

Dilip Shanghvi: సన్‌ ఫార్మా తయారీ ప్లాంట్‌ను ఏ రాష్ట్రంలో నెలకొల్పనున్నారు?

Sun Pharma

ఫార్మాస్యూటికల్స్‌ రంగంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్‌ ఫార్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ప్లాంట్‌గా దీన్ని తీసుకొస్తామని, ఎగుమతులు లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్‌ సంఘ్వీ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో డిసెంబర్ 28న క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సందర్భంగా దిలీప్‌ సంఘ్వీ ఈ విషయాలను వెల్లడించారు. ఏపీలో ఫార్మాస్యూటికల్‌ రంగం ప్రగతి, సన్‌ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.

ఐపీపీబీతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జట్టు

ఆర్థిక సేవలు అంతగా అందుబాటులో లేని సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సర్వీసులు అందించే దిశగా ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ)తో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చేతులు కలిపింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

చ‌ద‌వండి: రాష్ట్ర వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏ నగరంలో ఏర్పాటైంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్‌ ఫార్మా తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తాం
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు    : సన్‌ ఫార్మాఎండీ దిలీప్‌ సంఘ్వీ 
ఎందుకు : ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు లక్ష్యంగా...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 29 Dec 2021 09:16PM

Photo Stories