Literacy Rate: పడ్నా–లిఖ్నా అభియాన్‌ను తొలుత ఏ జిల్లాలో అమలులోకి తెచ్చారు?
నిరక్షరాస్యులైన మహిళల్లో అక్షరవెలుగులు నింపేందుకు కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. ఇందుకోసం ‘పడ్నా–లిఖ్నా అభియాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. రాష్ట్రంలోనే మొదటిగా విజయనగరం జిల్లాలో కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చాయి. జిల్లాలోని 39,336 మంది మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నాయి.
60:40 నిష్పత్తిలో ఖర్చు..
వివిధ కారణాలతో చిన్నప్పుడు చదువుకోలేక, విద్యకు దూరమైనవారితో ఓనమాలను దిద్దించేందుకు 2021 జూన్‌లో ‘పడ్నా–లిఖ్నా అభియాన్’ క్యాక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికి అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తాయి.
ఇతర జిల్లాలలో పోలిస్తే..
విజయనగరం జిల్లాలో అక్షరాస్యత ఇతర జిల్లాలలో పోలిస్తే తక్కువగా ఉంది. ప్రధానంగా మహిళా అక్షరాస్యత మరింత తక్కువ. జిల్లాలో సగటు అక్షరాస్యత 58.89 శాతం ఉండగా వీరిలో పురుషుల అక్షరాస్యత 68.15 శాతం, మహిళల అక్షరాస్యత 49.87 శాతం మాత్రమే. దీంతో జిల్లాలో 2021, నవంబర్ 19న ‘పడ్నాలిఖ్నా అభియాన్’ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. తొలివిడతగా 10 మండలాలకు చెందిన 39,336 మంది మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులను చేయాలని సంకల్పించారు. 2022, ఫిబ్రవరి 15 నాటికి తొలివిడత శిక్షణ కార్యక్రమం పూర్తికానుంది.
చదవండి: టోఫీ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో పడ్నా–లిఖ్నా అభియాన్‌ను తొలుత అమలులోకి తెచ్చారు?
ఎప్పుడు : నవంబర్ 19, 2021
ఎవరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఎక్కడ : విజయనగరం జిల్లా
ఎందుకు : నిరక్షరాస్యులైన మహిళల్లో అక్షరవెలుగులు నింపేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్