Educational Institutions: టోఫీ పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం?
పాఠశాలలు, వాటి పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల రహిత వాతావరణం ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఇప్పటికే విద్యా సంస్థల ప్రహరీల నిర్మాణంతో పాటు, పాఠశాలకు వంద గజాల్లోపు ప్రాంతంలో సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించింది. అదే విధంగా విద్యాసంస్థలు, వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా ఇతర కార్యక్రమాలు చేపడుతోంది. వైద్యారోగ్య శాఖ ఇతర శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. విద్యా సంస్థలను పొగాకు రహిత ప్రాంతంగా ధ్రువీకరించేలా 9 ప్రమాణాలతో వైద్య శాఖ ‘టుబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్’(టోఫీ) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చి.. దానిని ఏపీ ఏఎన్‌ఎం హెల్త్ యాప్‌తో అనుసంధానించింది.
చదవండి: అటవీ విస్తీర్ణం పెరుగుదలలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : టుబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్(టోఫీ) పేరుతో ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం?
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : విద్యాసంస్థలు, వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా చేపడుతున్న చర్యల్లో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్