Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో నూతన అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటు కానుంది?
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్ (మిధానీ)లు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నాయి. నాల్కో, మిధానీల సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూ మినియం ధాతు నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ కర్మాగారం ఏర్పాటు కానుంది. రూ.5,500 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఇది ఏర్పాటవుతోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 60 వేల మెట్రిక్ టన్నులు.
GK Sports Quiz: FIDE చెస్ ఒలింపియాడ్ 2022 టోర్నమెంట్ ఎక్కడ జరిగింది?
నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిధానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా ఏప్రిల్ 25న సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. రెండున్నరేళ్ల లోగా పరిశ్రమ ఏర్పాటు కానుందని పేర్కొన్నారు.
Andhra Pradesh: వైఎస్సార్ సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ కర్మాగారం ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్ (మిధానీ)
ఎక్కడ : బొడ్డువారిపాలెం, కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్