Skip to main content

Hyundai Group Investment : తెలంగాణ రాష్ట్రంలో హ్యుందాయ్‌ పెట్టుబడులు

రాష్ట్రంలో ఏర్పాటయ్యే మొబిలిటీ క్లస్టర్‌లో పెడుతున్నట్లు సంస్థ ప్రకటన మొబిలిటీ వ్యాలీలోనూ భాగస్వామ్యం మాస్టర్‌ కార్డ్‌తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం
Hyundai Group Investment in Telangana
  • Download Current Affairs PDFs Here
  • సాక్షి, హైదరాబాద్‌: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా తెలంగాణ మే 26  (గురువారం) మరో భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్‌లో దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ రూ.1,400 కోట్ల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు ప్రకటించింది. మాస్టర్‌కార్డ్, జీఎంఎం ఫాడ్లర్, ఈఎంపీఈ తదితర సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలపై కీలక ప్రకటనలు చేశాయి. 
  • కేటీఆర్‌తో హ్యుందాయ్‌ సీఈఓ భేటీ
  • హ్యుందాయ్‌ సీఈఓ యంగ్చో చి మే 26(గురువారం) కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడిపై ప్రకటన చేశారు. మొబిలిటీ క్లస్టర్‌లో పెట్టుబడులకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీ లోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. తెలంగాణలో ఏర్పాటు చేసే యూనిట్‌ ద్వారా టెస్ట్‌ ట్రాక్‌లతో పాటు ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుంది. హ్యుందాయ్‌ రాకతో మొబిలిటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.
  • ప్రపంచ స్థాయి పౌరసేవలే లక్ష్యంగా..
  • డిజిటల్‌ టెక్నాలజీల ద్వారా తెలంగాణ పౌరులకు ప్రపంచ స్థాయి పౌర సేవలు అందించేందుకు అమెరికాకు చెందిన ‘మాస్టర్‌ కార్డ్‌’తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. కేవలం డిజిటల్‌ చెల్లింపులకే పరిమితం కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల సప్లై చైన్‌ డిజిటలీకరణ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ అక్షరాస్యత తదితర రంగాల్లోనూ తెలంగాణ ప్రభుత్వంతో మాస్టర్‌ కార్డ్‌ భాగస్వామ్యమవుతుంది.
  • Telangana: రాష్ట్ర హైకోర్టు నూతన సీజేగా ఎవరు నియమితులు కానున్నారు?

  • సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులతో పాటు ఇతర పౌర సేవా రంగాల్లో ఈ ఒప్పందం కీలకమని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. పౌర సేవలు, చిన్న తరహా వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియను తమ ఎంవోయూ వేగవంతం చేస్తుందని మాస్టర్‌ కార్డ్‌ వైస్‌ చైర్మన్‌ మైఖేల్‌ ఫ్రొమన్‌ వెల్లడించారు.
  • జీనోమ్‌ వ్యాలీలో ఈఎంపీఈ డయాగ్నొస్టిక్స్‌ యూనిట్‌
  • క్షయ వ్యాధి డయాగ్నొస్టిక్‌ కిట్‌ల అంతర్జాతీయ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్వీడన్‌కు చెందిన ‘ఈఎంపీఈ డయాగ్నొస్టిక్స్‌’ప్రకటించింది. రూ.25 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్‌లో నెలకు 20 లక్షల కిట్‌లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తారు. దీనిద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ పవన్‌ అసలాపురం వెల్లడించారు. తర్వాతి దశలో రూ.50 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్‌లో మొత్తంగా రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టే యోచనలో ఉన్నామని తెలిపారు.
  • హైదరాబాద్‌లో జీఎంఎం ఫాడ్లర్‌ విస్తరణ 
  • ఫార్మా కంపెనీలకు అవసరమైన గ్లాస్‌ రియాక్టర్, ట్యాంక్, కాలమ్‌లను తయారు చేసే జీఎంఎం ఫాడ్లర్‌ హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. సంస్థ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ సీఈఓ థామస్‌ కెహ్ల్, డబ్ల్యూఈఎఫ్‌ డైరెక్టర్‌ అశోక్‌ జె పటేల్‌ మే 26 (గురువారం) కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రెండేళ్ల క్రితం రూ.48 కోట్లకు పైగా పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన జీఎంఎం ఫాడ్లర్‌ అదనంగా మరో రూ.28 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు.
  •  
  • ఈ పెట్టుబడి ద్వారా సంస్థలో ఉద్యోగుల సంఖ్య 300కు చేరుకుంటుంది. కాగా హైదరాబాద్‌ ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండేందుకు సంస్థ ఆసక్తి చూపింది. రసాయన, ఔషధ, ఆహారం, విద్యుత్‌ పరిశ్రమలకు అవసరమయ్యే తుప్పు నిరోధక పరికరాల తయారీ సాంకేతికతలో జీఎంఎం ఫాడ్లర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. 
  • స్టార్టప్‌లకు రాజధానిగా హైదరాబాద్‌: కేటీఆర్‌
  • దేశంలో ఆవిష్కరణల సంస్కృతి పెరిగినపుడే అన్ని రంగాల్లో వేగంగా పురోగతి సాధ్యమవుతుందని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. భారత స్టార్టప్‌ల రంగంలో అద్భుత విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులతో మే 26 (గురువారం) దావోస్‌లో జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆవిష్కరణలు వ్యాపార, వాణిజ్య అవకాశాలు సృష్టించడంతో పాటు విభిన్న సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతాయని చెప్పారు. అయితే ఇవి కేవలం శాస్త్ర సాంకేతిక రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే ఇతర సమస్యలకు కూడా పరిష్కారం చూపాలన్నారు. హైదరాబాద్‌లో ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఊతంగా నిలుస్తోందని తెలిపారు. స్టార్టప్‌లలో 95 శాతం విఫలమయ్యే అవకాశమున్నా కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. 
  • Daily Current Affairs in Telugu: 2022, మే 21 కరెంట్‌ అఫైర్స్‌
  • తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ ‘టీ హబ్‌’నిర్మాణం, పాఠశాల స్థాయి నుంచే ఆవిష్కరణలపై అవగాహన కోసం ‘తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌’ఏర్పాటు వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఇన్నోవేషన్‌ రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు స్టార్టప్‌ల రూపంలో ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ స్టార్టప్‌లకు రాజధానిగా మారుతుందన్నారు. చర్చా గోష్టిలో పాల్గొన్న యూనికార్న్‌ స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులు తమ అనుభవాలు, విజయగాథలను పంచుకున్నారు.
  • Daily Current Affairs in Telugu: 2022, మే 26 కరెంట్‌ అఫైర్స్‌

  • ప్రశాంత్‌ పిట్టి (ఈజ్‌ మై ట్రిప్‌), విధిత్‌ ఆత్రే (మీషో) సచిన్‌దేవ్‌ దుగ్గల్‌ (ఏఐ), నిఖిల్‌ కామత్‌ (జెరోధా) ఆవిష్కరణల రంగం భవిష్యత్తు, అవకాశాలపై అభిప్రాయాలు తెలియజేశారు. దేశంలో ద్రవోల్బణం, జీడీపీ, తలసరి ఆదాయం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వాలు మారినా రెండు దశాబ్దాల పాటు ఆవిష్కరణల రంగంపై విధానపరమైన స్థిరత్వం ఉండాలని సూచించారు. 
     
Published date : 27 May 2022 03:31PM

Photo Stories