Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, మే 26 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu May26th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Telugu Current Affairs Daily

Captain Abhilasha : తొలి మహిళా యుద్ధ పైలట్‌ ?​​​​​​​

భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ పైలట్‌గా కెప్టెన్‌ అభిలాష బారక్‌ చరిత్ర సృష్టించారు. నాసిక్‌లోని కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ కేంద్రంలో మే 24 (మంగళవారం) ఉన్నతాధికారులు ఆమెకు సంబంధిత ‘వింగ్స్‌’ ప్రదానం చేశారు.
First female fighter pilot‌
First female fighter pilot‌

36 మంది పైలట్లతోపాటు ఆమె శిక్షణ పూర్తిచేశారు. హరియాణాకు చెందిన అభిలాష 2018లో ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కోర్‌లో చేరారు. ఆమె తండ్రి ఓం సింగ్‌ సైన్యంలో కల్నల్‌గా  చేశారు. ఏవియేషన్‌ కార్ప్స్‌లో చేరకముందే పలు ప్రొఫెషనల్‌ ఆర్మీ కోర్సులను ఆమె పూర్తి చేశారు.
  వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ఎప్పుడు జ‌రుపుకుంటారు?

 

Ranil Wickramasinghe : శ్రీలంక ఆర్థిక మంత్రిగా ఎన్నికైన వ్యక్తి ?​​​​​​​

శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా స్వీకరించారు.
The Finance Minister of Sri Lanka
The Finance Minister of Sri Lanka

అధ్యక్షుడు గొటబయా రాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఒడ్డున పడేసే బాధ్యతను రణిల్‌ స్వీకరించారు.

Investments: తెలంగాణకు భారీ పెట్టుబడులు..

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంవోయూలు మేధా సర్వోడ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ‘స్టాడ్లర్‌ రైల్‌’ భాగస్వామ్యం ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి కోచ్‌ల ఎగుమతి హైదరాబాద్‌లో ఫార్ములేషన్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనున్న ఫెర్రింగ్‌ ఫార్మా..
Huge investments in Telangana
Huge investments in Telangana
  • Download Current Affairs PDFs Here
  • సాక్షి, హైదరాబాద్‌: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ భారీ పెట్టుబడులు సాధిస్తోంది. పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బుధవారం రెండు భారీ పెట్టుబడులు సాధించింది. రైల్వే కోచ్‌ల తయారీలో పేరొందిన స్టాడ్లర్‌ రైల్‌ సంస్థ వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. 
  • ఈ మేరకు తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో స్టాడ్లర్‌ రైల్‌ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌ రైల్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఆన్స్‌ గార్డ్‌ బ్రొక్‌మెయ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోకిలలో ఇప్పటికే  రెల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన మేధా సర్వోడ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి స్టాడ్లర్‌ రైల్‌ ఇక్కడ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. 
  • Palm Oil Exports: పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
  • ప్రస్తుత పెట్టుబడి ద్వారా సుమారు 2,500 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే కోచ్‌లు దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి కూడా ఎగు మతి అవుతాయి. కాగా స్టాడ్లర్‌ రైల్‌ పెట్టుబడిపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విదేశాలకు కూడా కోచ్‌లు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం తెలంగాణకు గర్వకారణమన్నారు.
  •  ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితమైందని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేసే తమ యూనిట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందనిబ్రొక్‌మెయ్‌ పేర్కొన్నారు. తమ కంపెనీ ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు. 

స్వల్ప వ్యవధిలోనే ఫెర్రింగ్‌ ఫార్మా విస్తరణ 

  • భారత్‌లో తమ విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు మరో స్విస్‌ సంస్థ ఫెర్రింగ్‌ ఫార్మా ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో బుధవారం మంత్రి కేటీఆర్‌తో సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లేసండ్రో గిలియో ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. క్రోన్, అల్సరేటివ్‌ కోలైటిస్‌ వంటి (జీర్ణకోశ సంబంధిత) వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘పెంటసా‘ను ఉత్పత్తి చేసేందుకు తెలంగాణలోని కొత్త ప్లాంట్‌ను వినియోగించుకోనున్నట్లు తెలిపింది. 
  • DRDO: నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు?
  • ప్రపంచం లోని అతిపెద్ద మేసాలజైన్‌ అనే యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రేడియంట్‌ (ఏపీఐ) తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్‌ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల్లో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటికి అదనంగా హైదరాబాద్‌ నగరంలో తన ఫార్ములేషన్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నెలరోజుల క్రితమే తమ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంస్థ స్వల్ప వ్యవధిలోనే అదనంగా మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. 
  • తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్రెంచ్‌ కంపెనీ ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ రాష్ట్రంలో మరో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో బుధ వారం భేటీ సందర్భంగా సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లుక్‌ రిమోంట్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న తమ యూనిట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా అడ్వాన్‌డ్‌ లైట్‌ హౌస్‌ అవార్డును అందు కున్నదని రిమోంట్‌ తెలిపారు. ఐఓటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనలిటిక్స్, ఏఐ డీప్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానం వాడినందుకు ఈ అవార్డు దక్కిం దన్నారు.
  • Lunar Soil: ఏ దేశ శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చంద్రుడి మట్టిలో మొక్కలు పెంచారు?
  • తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయంటూ, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే తమ కంపెనీ విస్తరణకు పూనుకున్నట్లు తెలిపారు. తమ నూతన తయారీ ప్లాంట్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్‌ సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తుం దని చెప్పారు. ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ అదనపు తయారీ యూనిట్‌ వలన కొత్తగా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేటీఆర్‌ తెలిపారు. 

కేటీఆర్‌తో ప్రముఖుల భేటీ..

  •   ప్రముఖ సంస్థ ‘బైజూస్‌‘సహ వ్యవస్థాపకులు రవీంద్రన్, దివ్య గోకుల్‌నాథ్‌ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అట్టడుగువర్గాల పిల్లల కోసం విద్యా కేంద్రాల ఏర్పాటుతో పాటు, వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో 
  • భాగస్వామ్యంపై వారు చర్చించారు.  
  •  తెలంగాణలో హైస్పీడ్‌ రైల్‌ వ్యవస్థల తయారీ, తమసంస్థ పరిశోధన, అభివృద్ధి కార్యకలా పాల విస్తరణపై హిటాచీ ఎండీ భరత్‌ కౌశల్‌ మే 24 (బుధవారం) కేటీఆర్‌తో చర్చించారు. 
  •  ఫార్మాస్యూటికల్స్, డయాగ్నొస్టిక్స్‌ రంగంలో ప్రపంచంలో పేరొందిన బయోటెక్‌ కంపెనీ ‘రోచ్‌‘చైర్మన్‌ డాక్టర్‌ క్రిస్టోఫ్‌ ఫ్రాంజ్‌ కూడా కేటీఆర్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీ, జీనోమ్‌ వ్యాలీ, మెడిటెక్‌ పార్క్‌ వంటి తెలంగాణ ప్రత్యేకతలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. 

Sex workers ను గౌరవించండి: పోలీసులకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: ‘‘సెక్స్‌ వర్కర్లూ అందరిలాంటి మనుషులే. వారికి తగిన గౌరవమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై వేధింపులకు పాల్పడరాదు’’ అని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. మనుషుల మర్యాదకు కనీస భద్రత కల్పించడం బాధ్యతగా గుర్తించాలని పేర్కొంది. 

సెక్స్‌ వర్కర్లను వ్యభిచార కూపం నుంచి రక్షించినప్పుడు సంబంధిత ఫోటోలను, వారి గుర్తింపును బయటపెట్టరాదని ప్రసార మాధ్యమాలకు హితవు పలికింది. సెక్స్‌ వర్కర్లకు గౌరవం, భద్రత కల్పించడానికి చట్టమేదీ లేదు. దాంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు పోలీసులకు, మీడియాకు ఆదేశాలిచ్చింది. 

సెక్స్‌వర్కర్లపై వేధింపులపై 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గావై, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు ప్యానెల్‌ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.

New Innovations, Start-ups : స్టార్టప్స్‌ హబ్‌గా సాగర నగరం

స్టార్టప్స్‌ హబ్‌గా సాగర నగరం అన్ని వనరులు సమకూరుస్తామన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈవోలతో భేటీ

Vishakha is a Unicorn Startup Hub

  • సాక్షి, అమరావతి: నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విశాఖను యూనికార్న్‌ స్టార్టప్‌ (సుమారు రూ.7,700 కోట్ల విలువ చేరుకున్నవి) హబ్‌గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 
  • Download Current Affairs PDFs Here
  • దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు నాలుగో రోజు సమావేశాల సందర్భంగా యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈవోలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్‌ ఆత్రేయ, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సంస్థ బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (పబ్లిక్‌ పాలసీ) సుష్మిత్‌ సర్కార్, ఇండియాలో క్రిప్టో కరెన్సీ లాంటి సేవలు అందిస్తున్న కాయిన్‌స్విచ్‌ కుబేర్‌ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈవో ఆశిష్‌ సింఘాల్, ఆన్‌లైన్‌ పర్యాటక బుకింగ్‌ పోర్టల్‌ ఈజ్‌మై ట్రిప్‌ ప్రశాంత్‌ పిట్టి, వీహివ్‌.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్‌ జయకుమార్, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సంస్థ కొర్‌సెరా వైస్‌ ప్రెసిడెంట్‌ కెవిన్‌మిల్స్‌ తో సీఎం జగన్‌ సమావేశమై రాష్ట్రంలో స్టార్టప్స్‌ కంపెనీల ఏర్పాటుపై చర్చించారు.
  • రాష్ట్రంతో కలసి పనిచేస్తాం

  • ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పి బైజూస్‌ పాఠ్యప్రణా ళికను రాష్ట్ర విద్యార్థులకు అందిస్తామని బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (పబ్లిక్‌ పాలసీ) సుష్మిత్‌ సర్కార్‌ వెల్లడించారు. రాష్ట్ర విద్యారంగానికి తోడ్పాటు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే, రికార్డులను భద్రపరచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంపై కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆశిష్‌ సింఘాల్‌తో సీఎం జగన్‌ చర్చించారు. 
  • Palm Oil Exports: పామాయిల్‌ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం?
  • సర్వే రికార్డులు  నిక్షిప్తం చేయడంపై సహకారం అందిస్తామని సింఘాల్‌ తెలిపారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి చేయూత అందించి పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించేలా సహకారం అందిస్తామని ఈజ్‌మై ట్రిప్‌ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ పిట్టి సీఎంతో సమావేశం సందర్భంగా పేర్కొన్నారు.
  • GK Science & Technology Quiz: పూర్తిగా సౌరశక్తితో నడిచే దేశపు మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ పంచాయతీగా అవతరించిన గ్రామం?

Mohinder K. Midha : లండన్‌ తొలి దళిత మేయర్?

​​​​​​​భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కౌన్సిలర్‌ మొహిందర్‌ కె.మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు.

లండన్‌లో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డుకెక్కారు. ఆమె ఎన్నిక పట్లయ లేబర్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు గర్వకారణమని యూకే లోని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అంబేడ్కరైట్, బుద్ధిస్ట్‌ ఆర్గనైజేషన్‌’ చైర్మన్‌ సంతోష్‌దాస్‌ చెప్పారు.

Published date : 26 May 2022 07:37PM

Photo Stories