Skip to main content

JSW Steel Plant: కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమి పూజ

వైఎస్సార్‌ జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ భూమిపూజ చేశారు.
CM Jagan Participates in JSW Steel Plant Bhoomi Pooja

జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ సంస్థ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించనున్నారు. తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. స్టీల్‌ ప్లాంట్ నిర్మాణంతో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభించ‌నున్నాయి. 

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్‌ 23న స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. కాగా 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలమైంది. ప్రజలు బతుకు జీవుడా అంటూ తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల తక్షణ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని నిపుణులు వివరిస్తున్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (22-28 జనవరి 2023)

జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌చే భూమి పూజ..
చెప్పిన మాట ప్రకారం జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. గ‌తంలో ఆయ‌న‌ జిల్లా పర్యటన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌ ద్వారా జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు జీఓ ఎంఎస్‌ నంబర్‌ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్‌ 16న ఉత్తర్వులు జారీ చేశారు.

మార్చి 31, 2029 నాటికి పూర్తి..
తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్‌ టన్నులు (10లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ సిద్ధమైంది. అందుకోసం ఫేజ్‌–1లో రూ.3,300 కోట్లు వెచ్చించి, 36 నెలల కాలపరిమితిలో ఫేజ్‌–1 పనులు పూర్తి కానున్నాయి. తొలివిడత ప్లాంట్‌లో వైర్‌ రాడ్స్, బార్‌ మిల్స్‌ ఉత్పత్తి చేయనున్నారు. మరో రూ.5,500 కోట్లతో ఫేజ్‌–2 నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఫేజ్‌–2 సైతం మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Andhra Pradesh: టూరిస్ట్ పోలీస్ స్టేష‌న్ల‌కు సీఎం జ‌గ‌న్ శ్రీకారం

మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు వెచ్చిస్తోంది. నాలుగులేన్ల రహదారి, రైల్వే కనెక్టివిటీ, నీటి వసతి కోసం పైపు లైన్‌ ఏర్పాటు, నిల్వ చేసుకునేందుకు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు, విద్యుత్‌ సరఫరా, కాంపౌండ్‌ వాల్, భవన సముదాయం నిర్మించనున్నారు. అందులోభాగంగా ఎన్‌హెచ్‌–67 నుంచి ముద్దనూరు టు జమ్మలమడుగు రోడ్డుకు అనుసంధానంగా రూ.145.3 కోట్లతో 12 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారి నిర్మించనున్నారు.

అలాగే ఎర్రగుంట్ల టు ప్రొద్దుటూరు రైల్వేలైన్‌ నుంచి రూ.323.5 కోట్లతో 9.4 కిలో మీటర్లు రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. మైలవరం జలాశయం నుంచి 2 టీఎంసీల నీరు సరఫరా చేయనున్నారు. అందుకోసం 15 కిలోమీటర్లు పైపులైన్‌ నిర్మించనున్నారు. ఇప్పటికే విద్యుత్‌ సరఫరాకు కావాల్సిన చర్యలు పూర్తి అయ్యాయి. రూ.76.42 కోట్లతో 27 కిలోమీటర్ల మేరకు విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు, 33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం పూర్తయింది.20 లక్షల లీటర్ల సామర్థ్యం కల్గిన సంప్‌ నిర్మాణం పూర్తయింది.  

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లక్షకు పైగా జాబ్స్‌

Published date : 15 Feb 2023 12:07PM

Photo Stories