Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ జిల్లాలో బ్లూ స్టార్ తయారీ యూనిట్ ఏర్పాటవుతోంది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో రూ.520 కోట్ల పెట్టుబడితో బ్లూ స్టార్ ఏసీల తయారీ యూనిట్ ఏర్పాటవుతోంది. 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ తొలి దశకు బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ సెప్టెంబర్ 29న భూమి పూజ చేయనున్నారు. తొలి దశలో రూ.250 కోట్ల పెట్టుబడితో ఐదు లక్షల రూమ్ ఏసీల సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో రూ.270 కోట్ల పెట్టుబడితో ఏడాదికి 7 లక్షల రూమ్ ఎసీల సామర్థ్యంతో యూనిట్‌ను విస్తరించనున్నారు. ప్రస్తుతం బ్లూ స్టార్‌కు హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు యూనిట్లు ఉండగా ఇప్పుడు ఏపీలో ఏర్పాటు చేసే యూనిట్‌తో మూడోది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద బ్లూ స్టార్ యూనిట్ ఏర్పాటవుతోంది.
పాలవెల్లువ, మత్స్య శాఖలపై సమీక్ష
జగనన్న పాలవెల్లువ, మత్స్య శాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28న తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా హబ్‌ల్లో చిన్న సైజు రెస్టారెంట్ ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని సూచించారు. ఆక్వా రైతులకు మంచి ధరలు కల్పించేలా ఆక్వాహబ్‌లు, రిటైల్ వ్యవస్థలను తెస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన పాలవెల్లువ మార్గదర్శకాలు, శిక్షణ కరదీపిక పుస్తకాలను సీఎం ఆవిష్కరించారు. ‘ఫిష్ ఆంధ్రా’ లోగోను విడుదల చేశారు.
చదవండి: ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన దక్షిణాది రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.520 కోట్ల పెట్టుబడితో ఏసీల తయారీ యూనిట్ ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : బ్లూ స్టార్ సంస్థ
ఎక్కడ : శ్రీసిటీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం