Temples: ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన దక్షిణాది రాష్ట్రం?
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో కళ, సాంస్కృతిక, ఆరోగ్యవేదిక (ధర్మపథం) కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 27న తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ప్రాచీన కళలు, సాంస్కృతిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక సేవలకు ఆలయాలను వేదిక చేసేందుకు ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దేవదాయ శాఖ ఆధ్వర్యంలో...
దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మపథం పేరుతో ఆలయ ప్రాంగణాల్లో సాయంత్రం వేళ నాట్యం, శాస్త్రీయ సంగీతం, గాత్ర కచేరీలు, హరికథ, బుర్రకథ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు వంటివి ఏర్పాటు చేస్తారు. వారాంతాల్లో యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయుర్వేద, హోమియో వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఏపీ దేవదాయశాఖ మంత్రిగా వెలంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.
ఉత్తమ ట్రావెల్ ఏజెంట్‌గా సదరన్ ట్రావెల్స్
ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా తెలంగాణ పర్యాటక అభివృద్ధికి కృషి చేసిన సంస్థలకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తమ ట్రావెల్ ఏజెంట్‌గా అవార్డును దక్కించుకుంది. సెప్టెంబర్ 27న హైదరాబాద్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
చదవండి: తీవ్ర తుపాను ‘గులాబ్’ తీరం దాటిన ప్రాంతం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కళ, సాంస్కృతిక, ఆరోగ్యవేదిక (ధర్మపథం) కార్యక్రమాలు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రాచీన కళలు, సాంస్కృతిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక సేవలకు...