Skip to main content

Cyclone Gulab: తీవ్ర తుపాను ‘గులాబ్‌’ తీరం దాటిన ప్రాంతం?

Cyclone Gulab

వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్‌ 25న ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘గులాబ్‌’ తుపానుగా మారింది. ఈ తుపాను పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరప్రాంతాల్లోని కలింగపట్నం, గోపాల్‌పూర్‌ మధ్యలో సెప్టెంబర్‌ 26న తీరం దాటింది. తీరాన్ని తాకిన తుపాన్‌ అనంతరం కళింగపట్నానికి పశ్చిమంగా ఒడిశా వైపు పయనిస్తూ తీరం దాటింది. ఈ తుపాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, మహేంద్ర తనయ నదులు పొంగి ప్రవహించే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో కలింగపట్నం ఉండగా, ఒడిశాలోని గంజాం జిల్లాలో గోపాల్‌పూర్‌ ఉంది.

  • హుద్‌హుద్‌ తుపాను వేగం గంటకు 215 కి.మీ
  • తిత్లీ తుపాను వేగం గంటకు 195 కి.మీ
  • గులాబ్‌ తుపాను వేగం గంటకు 90 కి.మీ

చైనాలో ఏర్పడే తపాన్లను ఏమిని పిలుస్తారు?

అమెరికాలో తుపాన్లను టోర్నెడోలని, చైనాలో ఏర్పడే వాటిని టైఫూన్స్, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్‌ అని పిలుస్తారు. అలాగే ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుపాన్లను విల్లీవిల్లీస్, వెస్ట్‌ ఇండీస్‌ దీవుల్లోని తుపాన్లను హరికేన్స్‌ అంటారు.

 

చ‌ద‌వండి: రాష్ట్రంలోని ఏ జిల్లాలో డైకిన్‌ యూనిట్‌ ఏర్పాటు కానుంది?

 

Published date : 27 Sep 2021 04:58PM

Photo Stories