Daikin Company: రాష్ట్రంలోని ఏ జిల్లాలో డైకిన్ యూనిట్ ఏర్పాటు కానుంది?
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐఎస్–ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి జపాన్ ముందుకొచ్చింది. ఆ దేశానికి చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో ఎయిర్ కండిషనింగ్, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించింది.
చిత్తూరు జిల్లా శ్రీసిటీలో...
చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని పారిశ్రామికవాడ శ్రీసిటీలో 75.5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో డైకిన్ యూనిట్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు అక్కడ భూమి కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. శ్రీసిటీలో సెప్టెంబర్ 24న జరిగిన కార్యక్రమంలో డైకిన్ ఇండియా ఎండీ, సీఈఓ కన్వల్‌జీత్ జావాతోపాటు శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
తొలి కంపెనీగా...
పీఎల్‌ఐ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తొలి కంపెనీగా డైకిన్ రికార్డు సృష్టించింది. ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్ రంగంలో డైకిన్ గ్రూప్ ప్రపంచ ఖ్యాతి పొందింది.
చదవండి: దేశంలో మూడో అమెరికన్ కార్నర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిర్ కండిషనింగ్, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : జపాన్‌కి చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ఎక్కడ : శ్రీసిటీ, తిరుపతికి సమీపం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం