Visakhapatnam: దేశంలో మూడో అమెరికన్ కార్నర్ ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది?
విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించే వేదిక ‘అమెరికన్ కార్నర్’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏర్పాటైంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఈ కార్నర్‌ను సెప్టెంబర్ 23న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇది దేశంలో మూడో అమెరికా కార్నర్. ఒకటి అహ్మదాబాద్, మరోటి హైదరాబాద్, మూడోది విశాఖలో ఏర్పాటైంది. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యపై సూచనలు, సలహాలు.. మరెన్నో విధాలుగా సేవలందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కార్నర్ ప్రారంభ కార్యక్రమంలో అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్, యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి పాల్గొన్నారు.
చదవండి: ఏ దేశ సహకారంతో రాష్ట్రంలో ఆగ్రో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికన్ కార్నర్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించేందుకు...