Andhra Pradesh: చేదోడు పథకం కింద ఎంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందిస్తారు?
జగనన్న చేదోడు పథకం కింద రెండో విడతగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు రూ.285.35 కోట్ల ఆర్థ్ధిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 8న తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. 21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు చేదోడు పథకం కింద లబ్ధిపొందడానికి అర్హులు. వీరికి అందిచే ఆర్థిక సాయాన్ని వృత్తిపరమైన పనిముట్లు, పెట్టుబడి కోసం ఈ మొత్తాన్ని వారు ఉపయోగించుకోవచ్చు.
యూనికార్న్ సంస్థగా లివ్‌స్పేస్..
హోమ్ ఇంటీరియర్, రినొవేషన్ ప్లాట్‌ఫామ్ లివ్‌స్పేస్ యూనికార్న్‌గా ఆవిర్భవించింది. పీఈ దిగ్గజం కేకేఆర్‌సహా వివిధ సంస్థల నుంచి తాజాగా 18 కోట్ల డాలర్లు(సుమారు రూ. 1,350 కోట్లు) సమీకరించడం ద్వారా ఈ హోదాను అందుకుంది. బిలియన్ డాలర్ల(రూ. 7,500 కోట్లు) విలువలో నిధుల సమీకరణను చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లోనూ యూనికార్న్‌గా వ్యవహరించే సంగతి తెలిసిందే.
చదవండి: సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఎక్కడ ఆవిష్కరించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జగనన్న చేదోడు పథకం కింద రెండో విడతగా.. రూ.285.35 కోట్ల ఆర్థ్ధిక సాయం విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్