Skip to main content

Global Investors Summit: ఏపీలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్లోని అపారమైన అవకాశాలను వివరిస్తూ ‘అడ్వాంటేజ్ ఏపీ’పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ హిట్ అయ్యింది.
Global Investors Summit 2023

దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను పెడుతూ ఒప్పందాలు చేసుకున్నారు. రెండు రోజుల సమావేశాలకు రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు కరణ్ అదానీ, జిందాల్, భంగర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎంరావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతా రెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్ రెడ్డి, మషాహిరో యమాగుచి, టెస్లా కోఫౌండర్ మార్టిన్ ఎబర్హార్డ్ వంటి 30కిపైగా కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. అంబానీ మొదలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్త వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకోవడమే కాకుండా అందులో భాగస్వామ్యమవుతామంటూ ప్రకటించారు.
ఈ రెండు రోజుల సమావేశాల్లో 20 రంగాల నుంచి రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 378 ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా 6,09,868 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గత ప్రభుత్వాల వలే ప్రచారం కోసం ఒప్పందాలు కుదుర్చుకొని వదిలేయకుండా వాటిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి.. సీఎస్ అధ్యక్షతన ఒప్పందాల పర్యవేక్షణ కమిటీ వేశారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఒప్పందాల అమలు తీరు, అనుమతుల మంజూరు వంటి అంశాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని సీఎం ప్రకటించడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

అర్థవంతమైన చర్చలు 
ఈ సమావేశాల సందర్భంగా 15 రంగాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఇందులో ఆయా రంగాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ నిపుణులు పాల్గొని చర్చించారు. పలు దేశాల్లో ఉన్న పరస్పర పెట్టుబడుల అవకాశాలపై వియత్నాం, నెదర్లాండ్స్, యూఏఈ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా దేశాలతో కంట్రీసెషన్స్ జరిగాయి. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు సీఎం జగన్‌తో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని పెట్టుబడులు, ఉత్పత్తులు, ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 137 స్టాల్స్తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో జిల్లాల వారీగా ఎగుమతులను ప్రోత్సహిస్తున్న ఉత్పత్తుల స్టాల్ విశేషంగా ఆకర్షించింది. 25 దేశాల నుంచి 46 మంది రాయబారులతో పాటు మొత్తం 14,000కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 
14 యూనిట్లు ప్రారంభం 
రాష్ట్రంలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమైన 14 యూనిట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,  శరబానంద సోనావాల్ సమక్షంలో వర్చువల్గా ప్రారంభించారు. ఈ యూనిట్ల ప్రారంభం ద్వారా రూ.3,841 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడమే  కాకుండా 9,108 మందికి ఉపాధి లభించనుంది. క్లింబెర్లీ క్లార్క్, బ్లూస్టార్, అంబర్, హావెల్స్, ఎక్సలెంట్ ఫార్మా, ఎన్జీసీ టాన్స్మిషన్స్, చార్ట్ ఇండస్ట్రీస్, లారస్ ల్యాబ్, అమరా లైఫ్, శారదా ఫెర్రో అల్లాయిస్, విన్విన్ స్పెషాలిటీ, ఏవోవీ ఆగ్రో ఫుడ్స్, ఎస్హెచ్ ఫుడ్, అవేరా కంపెనీలున్నాయి. 

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం

‘దివీస్’ మరో రెండు ప్లాంట్లు.. సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడి 
ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ ఆంధ్రప్రదేశ్లో మరో రెండు యూనిట్లు నెలకొల్పనుంది. ఇందుకు దాదాపు రూ.1,480 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే రూ.780 కోట్ల ప్రతిపాదన ఆమోదం పొందగా కొత్తగా మరో రూ.700 కోట్ల ప్రతిపాదనలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అదనంగా 22 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని దివీస్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు వెల్లడించారు. కాకినాడలో రెండో దశ కింద ఒక యూనిట్, కృష్ణపట్నం దగ్గర మరొక దివీస్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి ఎగుమతి ఆధారిత యూనిట్లుగా (ఈవోయూ) ఉంటాయని వివరించారు. కొన్ని సమస్యల వల్ల కాకినాడ యూనిట్ పనులు గతంలో ముందుకు సాగలేదని, అవి పరిష్కారం కావడంతో రెండో దశ పనులు చేపట్టడానికి మార్గం సుగమమైందని చెప్పారు. మిగతా ప్రక్రియ పూర్తయితే రెండేళ్లలోగా ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.  
రెండేళ్లలో రూ.రెండు వేల కోట్లు 
భారత్ను ఫార్మా స్యూటికల్ రంగంలో భాగస్వామిగా చేసుకునేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్కు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చూపిస్తున్న చొరవ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారం కారణంగా ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. – వంశీకృష్ణ బండి, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ

 

Global Investors Summit: 340 ఒప్పందాలు.. 6 లక్షల ఉద్యోగాలు

మహిళా సాధికారతపై మరింత దృష్టి: సుచిత్రా ఎల్లా
మహిళా వ్యాపారవేత్తల సాధికారతపై భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) మరింతగా దృష్టి పెడుతోందని భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్ సుచిత్రా ఎల్లా తెలిపారు. ఇందుకోసం మరిన్ని సీఐఐ చాప్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వివరించారు. శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ విషయాలు చెప్పారు. స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాల్లో అత్యంత వేగవంతమైన అభివృద్ధి సాధిస్తోందని సుచిత్రా ఎల్లా తెలిపారు. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. సమ్మిళిత అభివృద్ధి సాధన దిశగా సీఎం జ‌గ‌న్‌ కృషి చేస్తున్నారని అభినందించారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతికి సీఐఐ నుంచి పూర్తిస్థాయిలో తోడ్పాటు అందిస్తామని సుచిత్రా ఎల్లా చెప్పారు. 
‘అపాచీ’ మరో 100 మిలియన్ డాలర్లు.. 10 వేల ఉద్యోగాల కల్పన 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు అపాచీ ఇండియా డైరెక్టర్ సెర్గియో లీ వెల్లడించారు. మరో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. తద్వారా 10 వేల ఉద్యోగాలను కల్పించనున్నట్లు చెప్పారు. మార్చి 4వ తేదీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అపాచీకి చైనా, భారత్, వియత్నాంలో ప్లాంట్లు ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్లాంటే అతి పెద్దదని వివరించారు. ఏపీలో ప్లాంట్పై ఇప్పటిదాకా 100 మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు చెప్పారు. సింగిల్ విండో క్లియరెన్స్తో పాటు సంస్థ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటును ప్రభుత్వం అందించిందన్నారు. 

Female Population: ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య.. ప్ర‌తి వెయ్యి మంది అబ్బాయిలకు ఎంత మంది అమ్మాయిలున్నారంటే..?

Published date : 06 Mar 2023 03:53PM

Photo Stories