Global Investors Summit: 340 ఒప్పందాలు.. 6 లక్షల ఉద్యోగాలు
రెండు రోజుల (మార్చి 3, 4వ తేదీ) జీఐఎస్ సదస్సు సందర్భంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన 340 ఒప్పందాలు రానున్నాయి. తొలి రోజు మార్చి 3వ తేదీ(శుక్రవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో కార్పొరేట్ దిగ్గజ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ద్వారా 3,92,015 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఒక్క ఇంధన రంగంలోనే రూ.8,25,639 కోట్ల విలువైన 35 ఒప్పందాలు కుదిరాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ, ఏబీసీ, ఇండోసోల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు, ఏసీఎంఈ, టెప్‌సోల్, అవాడా, గ్రీన్‌కో, అదానీ, అరబిందో, ఎన్‌హెచ్‌పీసీ, ఆదిత్య బిర్లా వంటి సంస్థలున్నాయి.
JSW Steel Plant: కడప స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ
ఇంధన రంగంలో పెట్టుబడుల ద్వారా 1,33,950 మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమలు, వాణిజ్య విభాగంలో రూ.3,20,455 కోట్ల విలువైన 41 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 1,79,850 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో జిందాల్ స్టీల్, శ్రీ సిమెంట్, మైహోమ్ సిమెంట్, అల్ట్రాటెక్, లారస్ మోండలెజ్, వెల్సపన్ వంటి సంస్థలున్నాయి. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో రూ.32,944 కోట్ల విలువైన 6 ఒప్పందాలు కుదరగా, వీటి ద్వారా 64,815 మౖందికి ఉపాధి లభించనుంది. ఇందులో టీసీఎల్, రిజల్యూట్, డైకిన్, సన్నీ ఆప్టెక్ వంటి సంస్థలున్నాయి.
పర్యాటక రంగంలో రూ.8,718 కోట్ల విలువైన 10 ఒప్పందాలు కుదరగా.. వీటి ద్వారా 13,400 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో డ్రీమ్‌వ్యాలీ గ్రూపు, ఒబెరాయ్, భ్రమరాంభ గ్రూపు, ఎంఆర్‌కేఆర్, మంజీరా హోటల్స్ వంటి సంస్థలున్నాయి. రెండవ రోజు శనివారం రూ.1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు కుదరనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Axis Bank: ఇకపై 120 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఆ బ్యాంక్ కనిపించదు..
రాష్ట్ర ప్రభుత్వ కృషిని కొనియాడిన కార్పొరేట్ దిగ్గజాలు
కోవిడ్ తర్వాత తక్కువ కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా పరుగులు పెట్టించి, రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ రోడ్‌షోలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. జీఐఎస్ సమావేశంలో పాల్గొన్న అంబానీ దగ్గర నుంచి బంగర్ వరకు అందరూ సీఎం జగన్ సాగిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను స్వాగతిస్తూ ప్రసంగించారు. ముఖ్యంగా విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ కృషిని కొనియాడారు. సభా ప్రాంగణానికి జగన్‌తో కలిసి వచ్చిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సభ ముగిసే వరకు.. ఆద్యంతం ముఖ్యమంత్రితో చర్చిస్తూ ఉల్లాసంగా కనిపించారు. సీఎం తన ప్రసంగం అనంతరం వేదికపై ఉన్న ప్రతి పారిశ్రామికవేత్త వద్దకు వెళ్లి నమస్కరించి పలకరించారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాల్స్‌ను సందర్శించారు. అంతకు ముందు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై నాలుగు ఆడియో విజువల్స్ ప్రదర్శించారు.
Anti Corruption: గురుగ్రాంలో జీ–20 దేశాల అవినీతి వ్యతిరేక వర్కింగ్ గ్రూప్ సదస్సు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
జీఐఎస్ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకర్షించాయి. ఎయిర్‌పోర్టులో అతిథులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహ్వానం పలికిన విధానం పలువురిని ఆకట్టుకుంది. ఈ విషయాన్ని పలువురు వక్తలు సదస్సులో ప్రస్తావించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్ర జానపద కళలు, కొమ్మునృత్యం, తప్పటగుళ్లు, ఉరుములు అందరినీ ఆకర్షించాయి. ఈ సదస్సుకు కార్పొరేట్ ప్రముఖలతో పాటు, విదేశీ రాయబారులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సమావేశాలకు హాజరైన వారికి ముఖ్యమంత్రి రాత్రి ప్రత్యేకంగా విందు ఇచ్చారు.
రంగం |
ఒప్పందాల సంఖ్య |
పెట్టుబడి రూ.కోట్లలో |
ఉపాధి |
ఇంధన రంగం |
35 |
8,25,639 |
1,33,950 |
పరిశ్రమలు |
41 |
3,20,455 |
1,79,850 |
ఐటీ, ఐటీఈఎస్ |
6 |
32,944 |
64,815 |
పర్యాటకం |
10 |
8,718 |
13,400 |