Skip to main content

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2021-22

వరుసగా రెండో ఏడాది కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా రైతు సంక్షేమం, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ మేరకు తాజా బడ్జెట్‌లోనూ ఈ రంగానికి పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేసింది.
Kurasala Kanna babu in assembly

Andhra Pradesh Agriculture Budget 2021-222 Highlights: వ్యవసాయం, అనుబంధ శాఖలకు మొత్తం రూ.31,256.36 కోట్ల కేటాయింపులతో 2021–22 వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మే 20న శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ శాసనమండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

రూ.2,096.38 కోట్లు అదనం..
2019–20లో రూ.28,866 కోట్లతో తొలి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 2020–21లో కేటాయింపులను రూ.29,159.97 కోట్లకు పెంచింది. 2021-22 ఏడాది ఏకంగా రూ.31,256.35 కోట్ల కేటాయించింది. గతేడాదితో పోలిస్తే 2021-22 ఏడాది రూ.2,096.38 కోట్లను అదనంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే వ్యవసాయ, పశు సంవర్ధక, సహకార, పట్టు పరిశ్రమల శాఖలకు కేటాయింపులు భారీగా పెంచడం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకూ నూతన జవసత్వాలనిచ్చింది.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా.. రూ. కోట్లలో

సంవత్సరం

మొత్తం బడ్జెట్‌

వ్యవసాయ బడ్జెట్‌

శాతం

2019–20

2,27,974.99

28,866.23

12.66

2020–21

2,24,289.18

29,159.97

12.97

2021–22

2,29,779.27

31,256.35

13.6


వ్యవసాయ బడ్జెట్‌లో కేటాయింపులు రూ.కోట్లలో

విభాగం

2020–21

2021–22

వ్యవసాయ శాఖ

10,399.52

12,049.29

ఉద్యాన శాఖ

653.02

537.03

పట్టు పరిశ్రమ

92.18

97.36

పశు సంవర్థక శాఖ

854.78

1,026.37

మత్స్య శాఖ

299.27

329.48

సహకార శాఖ

248.38

303.04

వ్యవసాయ మార్కెటింగ్‌

3,110.90

610.80

ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తూ

6,270

8.116.16

వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌

6,928

6,876.50

ఉచిత విద్యుత్‌ పథకం

4,450

5,000

ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి

2,000

2,000

ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

402

359.76

డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం

88.60

69.91

శ్రీవెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం

122.73

147.30

వ్యవసాయ యాంత్రీకరణ

207.83

739.46

వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా

500

1,802.82

మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు(శీతలీకరణ గిడ్డంగులు, గోదాముల నిర్మాణం)

200

610.80

వైఎస్సార్‌ పశు నష్టపరిహారం

50

50

ప్రకృతి వ్యవసాయం

225.51

311.62

వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలు

65

88.57

పశువుల దాణా కోసం(పశుగ్రాస భద్రతా పథకం)

20

101.47


ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయింపులు (రూ.కోట్లల్లో)

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు

500

ధరల స్థిరీకరణ నిధి (రూ.3వేల కోట్లు)ని భర్తీ చేసేందుకు

500

వైఎస్సార్‌ జలకళ

200

ఫుడ్‌ప్రొసెసింగ్‌ కోసం

186.91

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల బలోపేతం కోసం

128

రాయితీ విత్తనాల పంపిణీ కోసం

100

వైఎస్సార్‌ సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలు

88.57

వైఎస్సార్‌ పొలం బడులు నిర్వహణకు

61.91

రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం

20

ఆక్వా విద్యుత్‌ రాయితీకి

500

పశుగ్రాస భద్రతా పథకం కోసం

101.47

పాడి పరిశ్రమ మౌలిక సదుపాయాల కల్పన కోసం

100

వ్యాక్సిన్‌ ఉత్పత్తి–కొనుగోళ్లుకు

25

పులివెందులలో ముర్రాజాతి గేదెల పునరుత్పత్తి కేంద్రం

22.18

వైఎస్సార్‌ కడప జిల్లాలో కడక్‌నాథ్‌ కోడి పిల్లల ఉత్పత్తి కేంద్రం కోసం

2.0

వ్యవసాయ, సహకార శాఖ (సెక్రటేరియట్‌ ఎంప్లాయిస్,ఆఫీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కోసం)

214.80

పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖలకు (సెక్రటేరియట్‌ ఎంప్లాయిస్, ఆఫీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కోసం)

8.13


రైతు భరోసా పథకానికి రూ.6,976.50 కోట్లు(Farmer)
Current Affairs వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరం 51.95 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,928 కోట్లు పంపిణీ చేయగా.. 2021-22 ఏడాది ఈ పథకానికి రూ.6,976.50 కోట్లు కేటాయించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటివరకు రూ.17,029.88 కోట్లను రైతులకు పెట్టుబడి సాయంగా అందించారు.

మత్స్య, పశు సంవర్థక శాఖలకూ..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పశు సంవర్థక, మత్స్య శాఖలకు గతేడాదితో పోలిస్తే 221-22 ఏడాది భారీగా కేటాయింపులు జరిపారు. 2020-21 పశు సంవర్థక శాఖకు రూ.854.78 కోట్లు కేటాయిస్తే.. 2021-22 ఏడాది రూ.1,026.37 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే 171.59 కోట్లను అదనంగా కేటాయించారు. మత్స్య శాఖకు గతేడాది రూ.299 కోట్లు కేటాయిస్తే.. 2021-22 ఏడాది రూ.329.48 కోట్లు కేటాయించారు.

మంత్రి కన్నబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు...

  • విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో 10,544, పట్టణ కేంద్రాల్లో కొత్తగా 234 కేంద్రాలతో కలిపి మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం.
  • దేశంలో రైతులపై ఒక్క రూపాయి కూడా బీమా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.
  • రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి కూర్చొని పంటల ప్రణాళిక రూపొందించేలా దేశంలోనే వినూత్నంగా వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసి క్రియాశీలం చేశాం.
  • 2021 ఏడాది కొత్తగా సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని తెస్తున్నాం.
  • ఇప్పటికే ఆర్బీకేల ద్వారా ‘ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిటీ మేనేజ్డ్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ (ఏపీసీఎన్‌ఎఫ్‌) అమలు చేస్తున్నాం.
  • సీఎం యాప్‌ ద్వారా ప్రతి గ్రామంలో ఏ పంట ఎంత ధరలు ఉన్నాయో నమోదు చేస్తున్నాం.
  • రైతులకు చెల్లింపుల్లో పారదర్శకతక కోసం ఇ–సంతకం విధానాన్ని ప్రవేశపెట్టాం. గోనె సంచులపై క్యూఆర్‌ ట్యాగులతో అనుసంధానించాం.
  • దేశవ్యాప్తంగా వ్యాపారులతో మన గ్రామస్థాయి మార్కెట్లను అనుసంధానించేందుకు ‘ఇ–ఫార్మ్‌ మార్కెటింగ్‌’ వేదికను అందుబాటులోకి తెచ్చాం.
  • ప్రతి గ్రామంలో మార్కెటింగ్‌ మౌలిక వసతుల కల్పన కోసం రూ.14 వేల కోట్లతో ఫామ్‌ గేట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యవస్థను నెలకొల్పుతున్నాం.
  • ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ ఏర్పాటు కోసం రూ.2,850 కోట్లతో ప్రణాళికను ఆమోదించాం.
  • రూ.460 కోట్లతో 2020–25లో రాష్ట్రంలో 10,035 సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పేలా ప్రణాళిక రూపొందించాం.
  • ఉద్యానవన పంటల విస్తరణ పథకంలో భాగంగా 2021-22 ఏడాది అదనంగా లక్ష ఎకరాల్లో నూతన రకాల పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తాం.
  • పశువులకు తగినంత గ్రాసం అందించేందుకు దేశంలో మన రాష్ట్రమే తొలిసారిగా రూ.250 కోట్లతో పశుగ్రాస పథకాన్ని ప్రవేశపెట్టింది.
  • రూ.40.86 కోట్లతో పులివెందులలో ముర్రాజాతి గేదెల పునరుత్పత్తి కేంద్రాన్ని ఐదేళ్లలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం.
  • వైఎస్సార్‌ జలకళ పథకం కింద నాలుగేళ్లలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేస్తాం.


మరికొన్ని కేటాయింపులు

  • వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న సహకార శాఖకు రూ.303.04 కోట్లు
  • వైఎస్సార్‌ వ్యవసాయ టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు, నిర్వహణ కోసం రూ.88.57 కోట్లు
  • రాష్ట్రీయ కృషి వికాస యోజన(RKVY) రూ.583.44 కోట్లు
  • ధరల స్థిరీకరణ ఫండ్‌ రూ.500 కోట్లు
  • రైతులకు సున్నా వడ్డీ చెల్లింపుల కోసం రూ.500 కోట్లు
  • ప్రధానమంత్రి కృషి సంచాయియోజన(PMKSY) రూ.300 కోట్లు
  • వైఎస్‌ఆర్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ కోసం రూ.88.57 కోట్లు
Published date : 11 Mar 2022 12:00PM

Photo Stories