Skip to main content

Chief Ministers of Uttar Pradesh: యూపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ నేత?

Yogi Adityanath

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని లక్నోలోని అటల్‌ బిహారి వాజపేయి ఏకనా స్టేడియంలో మార్చి 25న నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగితో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. యోగితో పాటుగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా, 52 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. యూపీలో కొత్తగా ఏర్పాటైన యోగి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Chief Minister of Uttarakhand: ఉత్తరాఖండ్‌ సీఎంగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?

37 ఏళ్ల తర్వాత..
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ విజయం సాధించింది. దీంతో రాష్ట్ర చరిత్రలో 37 ఏళ్ల తర్వాత అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి పార్టీగా రికార్డు సృష్టించింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 202 సీట్ల మార్కును బీజేపీ  దాటేసింది. 403 అసెంబ్లీ స్థానాలకుగాను 255 చోట్ల జయకేతనం ఎగరవేసింది.

యోగి బంపర్‌ మెజారిటీ..
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన యోగి గోరఖ్‌పూర్‌ అర్బన్‌ నుంచి ఏకంగా 1.3 లక్షల పై చిలుకు ఓట్ల బంపర్‌ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పుడు ఆయన గోరఖ్‌పూర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం అయ్యాక శాసనమండలికి ఎన్నికయ్యారు.

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

పార్టీ

2022

2017

బీజేపీ

255

312

సమాజ్‌వాదీ

111

47

బీఎస్పీ

1

19

కాంగ్రెస్‌

2

7

అప్నాదళ్‌(ఎస్‌)

12

9

ఎస్‌బీఎస్‌పీ

6

4

ఆర్‌ఎల్‌డీ

8

1

నిషాద్‌ పార్టీ

6

1

ఇతరులు

2

3

 

Chief Minister of Manipur: మణిపూర్‌ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేసిన నేత?
ఎప్పుడు : మార్చి 23
ఎవరు    : బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌
ఎక్కడ    : అటల్‌ బిహారి వాజపేయి ఏకనా స్టేడియం, లక్నో, ఉత్తరప్రదేశ్‌
ఎందుకు : తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Mar 2022 07:01PM

Photo Stories