Chief Minister of Uttarakhand: ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?
ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత పుష్కర్ సింగ్ ధామి మార్చి 23న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మీత్ సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఖతిమా అసెంబ్లీ స్థానం నుంచి ఓడినా బీజేపీ అధిష్టానం పుష్కర్‌నే సీఎంను చేసింది. పుష్కర్ సీఎంగా కొనసాగాలంటే మరో ఆరు నెలల్లో ఆయన శాసనసభకు ఎన్నికల కావాల్సి ఉంది. మార్చి 10న వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇలా..
పార్టీ |
2022 ఎన్నికలు |
2017 ఎన్నికలు |
బీజేపీ |
47 |
57 |
కాంగ్రెస్ |
19 |
11 |
స్వతంత్రులు |
2 |
2 |
బీఎస్పీ |
2 |
0 |
Chief Minister of Manipur: మణిపూర్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం నుంచి..
సరిహద్దు ప్రాంతమైన పిథోరాగఢ్‌లో 1975 సెప్టెంబర్ 16న పుష్కర్ జన్మించారు. మాజీ సైనికుడి కుమారుడైన ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. తొలుత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో సభ్యుడిగా పనిచేశారు. పదేళ్లపాటు ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2002 నుంచి 2008 దాకా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. 2001–2002లో అప్పటి ముఖ్యమంత్రిగా భగత్‌సింగ్ కోషియారీ వద్ద ఓఎస్‌డీగా పనిచేశారు. 2012, 2017లో.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తొలిసారి 2021, జూలై 4న ప్రమాణ స్వీకారం చేశారు.
CEO of Telangana: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం స్వీకారం చేసిన నేత?
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : బీజేపీ నేత పుష్కర్ సింగ్ ధామి
ఎక్కడ : డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
ఎందుకు : తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో..