Telugu Poet: కథానాయకుడు జాషువా పుస్తకాన్ని ఎవరు రచించారు?
ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ (63) హఠాన్మరణం చెందారు. గుండెపోటు కారణంగా జనవరి 28న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. 1959 జనవరి 21న నిజామాబాద్‌లోని పాములబíస్తీలో జన్మించిన ఎండ్లూరి సుధాకర్.. హైదరాబాద్‌లోని ఓయూలో ఎంఏ, ఎంఫిల్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలంలో పీహెచ్‌డీ చేశారు. తెలుగు ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం ప్రారంభించి.. ఎంతో మంది విద్యార్థులకు, పరిశోధకులకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో విశేష సేవలందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగానూ పనిచేశారు.
ఎండ్లూరి రచనలు...: వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా(జీవిత చరిత్ర), తెలి వెన్నెల.. మొదలైనవి.
ఎండ్లూరిని వరించిన పురస్కారాలు: 1980లో లలితకళా పరిషత్ పురస్కారం, కవికోకిల జాషువా పురస్కారం, సినారె పురస్కారం, అధికార భాషా సంఘం పురస్కారం, ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం, ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారం, డాక్టర్ జీఎన్ రెడ్డి మెమోరియల్ అవార్డు, అరుణ్ సాగర్ ట్రస్ట్ మెమోరియల్ అవార్డు.. మొదలైనవి.
మిళింద కథా సంపుటిని ఎవరు రచించారు?
ఎండ్లూరి సుధాకర్ సతీమణి హేమలత, రచయిత్రి సామాజిక సేవకురాలు. ఆయన కుమార్తె మానస కథా రచయిత్రి. మానస రచించిన ‘మిళింద’ కథా సంపుటికి 2020లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది.
బుజ్జాయి అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన రచయిత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ కవి, సాహితీవేత్త కన్నుమూత
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ఆచార్య ఎండ్లూరి సుధాకర్ (63)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్