Cartoonist and Poet: బుజ్జాయి అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన రచయిత?
చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రముఖ కార్టూనిస్టు, చిన్నపిల్లల కథారచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి(90) కన్నుమూశారు. వయోభారంతో జనవరి 27న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో ప్రముఖ రచయిత, కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు 1931 సెప్టెంబర్ 11న ఆయన జన్మించారు. బుజ్జాయి అనే కలంపేరుతో ఫ్రీలాన్స్ కార్టూనిస్టుగా, చిన్నపిల్లల కథారచయితగా ప్రసిద్ధి చెందారు. ఆయన బొమ్మల కథల్లో ‘డుంబు’ చిన్నారులను బాగా అలరించింది. అలాగే ‘పంచతంత్ర’ ధారావాహిక కథలు ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో 1963–68 వరకు ప్రచురితమయ్యాయి. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పలు రచనలకు అవార్డులు అందించాయి.
కేంద్ర న్యాయమంత్రిగా ఎవరు ఉన్నారు?
ఇటీవల అదృశ్యమైన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు మిరమ్ తరోన్‌ను భారతీయ సైనికులకు చైనా ఆర్మీ (పీఎల్‌ఏ) అప్పగించిందని కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు జనవరి 27న ప్రకటించారు. అరుణాచల్‌లోని వాచా– దమాయ్ సరిహద్దు ప్రాంతం వద్ద తరోన్‌ను అప్పగించారన్నారు. 2022, జనవరి 18న తరోన్ చైనా భూభాగంలోకి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతన్ని వెతికి అప్పగించాలని పీఎల్‌ఏను భారత ఆర్మీ కోరింది.
తూర్పు సముద్రంలో క్షిపణుల ప్రయోగం చేసిన దేశం?
ఉత్తర కొరియా మరోసారి రెండు బాలిస్టిక్ మిసైళ్లను తూర్పు సముద్రంలోకి ప్రయోగించింది. దీంతో ఈ నెలలో ఆ దేశం చేపట్టిన ప్రయోగాల సంఖ్య ఆరుకు చేరుకుందని దక్షిణ కొరియా మిలటరీ వెల్లడించింది. ఉత్తర కొరియాలోని హామ్‌హంగ్ టౌన్ నుంచి జనవరి 27న ఈ ప్రయోగాలు జరిగాయని పేర్కొంది. అమెరికాతో ఆగిపోయిన అణ్వస్త్ర దౌత్య చర్చలు మళ్లీ జరిగేలా, తమపై విధించిన ఆంక్షలను ఎత్తేసేలా ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఉత్తర కొరియా ఇలా ప్రయోగాలు చేస్తోందని అంచనా. 2016 నుంచి అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతుండటంతో ఉత్తర కొరియా ప్రధాన ఎగుమతి కార్యకలాపాలు చాలా వరకు ఆగిపోయాయి.
చదవండి: శ్రీ విరించి అనే కలం పేరుతో రచనలు చేసిన రచయిత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రముఖ కార్టూనిస్టు, చిన్నపిల్లల కథారచయిత కన్నుమూత
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి(90)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వయోభారం కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్