Skip to main content

Telugu Poet: శ్రీ విరించి అనే కలం పేరుతో రచనలు చేసిన రచయిత?

Nallan Cakravartula Ramanujachari

శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత డాక్టర్‌ నల్లాన్‌ చక్రవర్తుల రామానుజాచారి (87) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా జనవరి 26న చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1935లో విజయవాడలో జన్మించిన రామానుజాచారి రాజనీతి శాస్త్రంలో ఎంఏ, పారిశ్రామిక వాణిజ్య చట్టాలలో బీఎల్‌తో పాటు డాక్టరేట్‌ కూడా చేశారు. తులనాత్మక తత్వశాస్త్రంలోనూ పట్టభద్రులు.

థియోసాఫికల్‌ సొసైటీలో సేవలు..

  • రామానుజాచారి 1958 నుంచి థియోసాఫికల్‌ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. చెన్నై సమీపం అడయార్‌లోని సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయంలో అనేక హోదాలలో బాధ్యతలు నిర్వర్తించారు.
  • తెలుగు, ఇంగ్లిష్‌లో అనేక కథలు రాశారు. తెలుగులో 100, ఇంగ్లిష్‌లో 50కిపైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు. వందలాది గ్రంథ సమీక్షలు చేశారు.
  • కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియాకు అనువాదకులు.
  • మధ్యమావతి, కొత్తనక్షత్రం (1982), అర్థం, కారనిæ కన్నీరు, మెట్లులేని నిచ్చెన (1995), కనకపు గట్టు (1997); గంధపు చుక్క (2000) వంటి పలు కథా సంపుటాలు వెలువరించారు. 
  • ఇంగ్లిష్‌లో అవేకనింగ్‌ టూ ట్రూత్, సీక్రెట్స్‌ ఆఫ్‌ అవర్‌ ఎగ్జిస్టెన్స్, ద ట్రూ పాత్‌ ఆఫ్‌ థియోసాఫీ, వర్డ్స్‌ ఆఫ్‌ విజ్‌డమ్‌ తదితర రచనలు చేశారు. సముద్ర శిఖర్‌ అనే హిందీ రచన కూడా చేశారు.
  • తెలుగు యూనివర్శిటీ అవార్డు, డాక్టర్‌ దాశరథి రంగాచార్య, శ్రీమతి కమలా సాహిత్య పురస్కారం (2004) వంటి పలు పురస్కారాలను అందుకున్నారు.

చ‌ద‌వండి: ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
శ్రీ విరించి అనే కలం పేరుతో అనేక రచనలు చేసిన ప్రముఖ కథా రచయిత కన్నుమూత
ఎప్పుడు : జనవరి 26
ఎవరు    : డాక్టర్‌ నల్లాన్‌ చక్రవర్తుల రామానుజాచారి (87)
ఎక్కడ    : చెన్నై, తమిళనాడు
ఎందుకు : గుండెపోటు కారణంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 27 Jan 2022 04:49PM

Photo Stories