Skip to main content

Superstar Krishna :ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు

లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు నవంబర్‌ 16(బుధవారం) హైదరాబాద్‌లోని వైకుంఠ మహా ప్రస్థానం మోక్షఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు.

అంతకుముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. కృష్ణ చితికి ఆయన కుమారుడు మహేశ్‌బాబు నిప్పంటించారు. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయరంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అంతకుముందు పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. 

superstar krishna passed away : సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూత.. సినిమాల్లోకి రావడానికి కారణం ఇదే..!

Published date : 17 Nov 2022 02:11PM

Photo Stories