Skip to main content

Somesh Kumar: సీఎం ప్రధాన సలహాదారుగా సోమేశ్‌కుమార్‌

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక పదవి అప్పగించారు. ఆయనను సీఎం ప్రధాన సలహాదారుగా నియమించారు.
Somesh Kumar appointed as Chief Advisor to CM KCR

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మే 9వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్‌ హోదాతో కూడిన ఈ ప్రధాన సలహాదారు పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దాదాపు మూడేళ్లపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన సోమేశ్‌కుమార్, హైకోర్టు ఆదేశాల మేరకు గత జనవరి 12న ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు బదిలీ అయ్యారు. ఆయన అక్కడ జాయిన్‌ అయినా.. ఆ తరువాత స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు.
ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వం దానిని ఆమోదించింది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్‌గా నియమితులవుతారని, ఆయన ఆ పదవికి దరఖాస్తు కూడా చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్‌ పనిచేసిన సమయంలో చేపట్టిన పలు కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ పలుమార్లు బహిరంగ వేదికలపైనే ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే సోమేశ్‌కుమార్‌కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. 

Kalyanalakshmi: కల్యాణలక్ష్మికి రూ.2 వేల కోట్లు
 

Published date : 10 May 2023 11:31AM

Photo Stories