Murari Lal: సర్వోదయ నేత మురారీ లాల్ కన్నుమూత
Sakshi Education
సామాజిక కార్యకర్త, సర్వోదయ, చిప్కో ఉద్యమాల నేత మురారీ లాల్(91) ఏప్రిల్ 12వ తేదీ కన్నుమూశారు.
చమోలి జిల్లా గోపేశ్వర్‌కు సమీపంలోని పాప్డియానా గ్రామంలో 1933లో మురారీ లాల్ జన్మించారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు మురారీ లాల్ అధ్యక్షుడిగా పనిచేశారు.
మురారీ లాల్ తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. చమోలీ జిల్లా మద్య నిషేధం కోసం ఉద్యమించారు. 1975–76 కాలంలో భూమి లేని పేదలకు లీజుపై భూమి దక్కేలా చేశారు. శ్రమదానంతో స్వగ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు.
Dr T N Subramaniam: భారత సంతతి గణితవేత్త సుబ్రమణ్యం కన్నుమూత
Published date : 15 Apr 2024 05:51PM