Skip to main content

6th Class Admissions 2025 : ఏక‌ల‌వ్య‌లో 6వ త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్.. ఎంపిక విధానం, ముఖ్య‌మైన తేదీలు..!!

విద్యార్థులు ఆర‌వ త‌ర‌గతిని ఏక‌ల‌వ్య‌లో చ‌ద‌వాల‌నుకుంటున్నారా..!
Sixth class admissions notification 2025 at ekalavya gurukul schools

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులు ఆర‌వ త‌ర‌గతిని ఏక‌ల‌వ్య‌లో చ‌ద‌వాల‌నుకుంటున్నారా..! అయితే, ఇదే మంచి అవ‌కాశం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో అడ్మిష‌న్ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలు పొందేందుకు నోటిఫికేషన్‌ వెలువడింది. 

ఎంపిక విధానం..

ఆరో తరగతి ప్రవేశాలు పొందే విద్యార్ధులకు ఈఎంఆర్‌ఎస్‌ సెలెక్షన్‌ టెస్ట్‌ (ఈఎంఆర్‌ఎస్‌ఎస్‌టీ)- 2025 ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 16వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప‌రీక్ష‌లో వచ్చిన ర్యాంకు, రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

HCU PG 2025 Notification : హెచ్‌సీయూ పీజీ 2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ముఖ్య‌మైన వివ‌రాలివే.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ..!!

సీట్ల వివ‌రాలు..

రాష్ట్రంలోని ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల స్కూల్‌లో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున ఉంటాయి. ఇలా మొత్తం 23 విద్యాలయాల్లో 1,380 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 690 బాలురు, 690 బాలికలకు సీట్లు కేటాయిస్తారు.

అర్హులు..

దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో 5వ తరగతి చదివి లేదా చదువుతూ ఉండాలి. ఇంటివద్ద ఐదో తరగతి చదివిన విద్యార్ధులు కూడా అర్హలే. అలాగే విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షన్నరకు మించకూడదు. విద్యార్ధుల వయసు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే మార్చి 31, 2012 నుంచి మార్చి 31, 2015 మధ్య జన్మించి ఉండాలి.

NCHMC JEE 2025: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ–2025 నోటిఫికేషన్‌ను విడుదల.. చివ‌రి తేది ఇదే..

ప్ర‌వేశ ప‌రీక్ష‌..

ఏక‌ల‌వ్య గురుకుల పాఠ‌శాల‌లో ప్ర‌వేశం కోసం ఎంట్రన్స్‌ టెస్ట్‌ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీలో 50 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్‌లో 25 ప్రశ్నలు, తెలుగు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తుల విధానం.. చివ‌రి తేదీ..

అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన విద్యార్థులు వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 16వ తేదీలోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించారు. ఈ ద‌ర‌ఖాస్తుల్లో ప్ర‌తీ విద్యార్థి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

PhD Admissions 2025: వేదిక్‌ వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్స్‌కి దరఖాస్తుల ఆహ్వానం

ముఖ్య‌మైన తేదీలు..

ద‌రఖాస్తులకు చివ‌రి తేదీ: ఫిబ్ర‌వ‌రి 16
ప్ర‌వేశ ప‌రీక్ష తేదీ: మార్చి 16
ఫ‌లితాలు విడుద‌ల తేదీ: మార్చి 31
మొద‌టి ద‌శ ప్ర‌వేశాలు ప్రారంభం తేదీ: మార్చి 31

అడ్మిష‌న్ పొందితే..

వీటిల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య అందిస్తారు. ఇంగ్లిస్ మీడియంలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్యాబోధన చేస్తారు. గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్‌ ట్రైబ్‌ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Jan 2025 04:43PM

Photo Stories