Skip to main content

Dadabhai Naoroji: లండన్‌ లో దాదాభాయ్‌ నౌరోజీ స్మృతికి నీరాజనం

Dadabhai Naoroji

'గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా'గా ప్రసిద్ధి చెందిన దాదాభాయ్‌ నౌరోజీ దక్షిణ లండన్‌ లో ఎనిమిదేళ్లపాటు నివసించిన గృహానికి నీలి ఫలకాన్ని అలంకరించినట్లు ఇంగ్లిష్‌ హెరిటేజ్‌ ఛారిటీ సంస్థ ప్రకటించింది. భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు దాదాభాయ్‌నౌరోజీ అప్పట్లో నివసించిన ఇటుక రాతి గృహానికి అలంకరించిన నీలి ఫలకం మీద ఆయన వివరాలను లిఖించారు. లండన్‌ లో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భవనాలకు నీలి ఫలకాలను అలంకరించే బ్లూ ప్లేక్‌పథకాన్ని ఇంగ్లిష్‌ హెరిటేజ్‌ నిర్వహిస్తోంది. లండన్‌ లో మహాత్మా గాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌లు నివసించిన గృహాలనూ గతంలో ఇదేవిధంగా గౌరవించింది.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Persons) Bitbank: శ్రీలంక కొత్త తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 26 Aug 2022 05:44PM

Photo Stories