Bulgarian President: బల్గేరియా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేత?
బల్గేరియా అధ్యక్షుడిగా రుమెన్ రదేవ్ జనవరి 19న ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష బాధ్యతలు రదేవ్ చేపట్టడం ఇది రెండోసారి. తొలిసారి 2017, జనవరి 22న అధ్యక్షలు బాధ్యతలు స్వీకరించారు. గతంలో బల్గేరియా వైమానిక శాఖలో పనిచేసిన ఆయన 2021 ఏడాది దేశంలో జరిగిన ఆందోళనలకు అనుకూలంగా మాట్లాడి అత్యంత ప్రజాదరణ పొందారు. దేశ రాజధాని నగరం సోఫియాలోని నేషనల్ అసెంబ్లీలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం రదేవ్ మాట్లాడుతూ... దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పడమే తన తక్షణ కర్తవ్యమని ప్రకటించారు. దేశాన్ని పీడిస్తున్న జనాభా, పేదరికం, అసమానతలపై పోరాడతానన్నారు. యూరోపియన్ యూనియన్‌లో పేద దేశంగా బల్గేరియా నిలుస్తోంది.
బల్గేరియా..
రాజధాని: సోఫియా; కరెన్సీ: లెవ్
అధికార భాష: బల్గేరియన్
ప్రస్తుత అధ్యక్షుడు: రుమెన్ రదేవ్
ప్రస్తుత ఉపాధ్యక్షుడు: ఇలియానా లోటోవా
ప్రస్తుత ప్రధానమంత్రి: కిరిల్ పెట్కోవ్
చదవండి: పండిట్ బిర్జూ మహరాజ్ ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : బల్గేరియా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేత?
ఎప్పుడు : జనవరి 19
ఎవరు : రుమెన్ రదేవ్
ఎక్కడ : నేషనల్ అసెంబ్లీ, సోఫియా, బల్గేరియా
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్